అభివృద్ధితోనే జీవనప్రమాణాలు

Sun,October 13, 2019 01:47 AM

-ఎంసీహెచ్చార్డీ సదస్సులో నిపుణుల అభిప్రాయం
హైదరాబాద్,నమస్తే తెలంగాణ: తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడినట్టు కాదని, సుస్థిరమైన అభివృద్ధితోనే ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడుతాయని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్చార్డీ) అదనపు డైరెక్టర్ జనరల్ హర్‌ప్రీత్ సింగ్, ఐఐపీఏ చైర్మన్ ఎమ్ గోపాలకృష్ణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మాజీ కమిషనర్ చెల్లప్ప, సెర్ప్ సీఈవో పసునూరి బసు తదితరులు అభిప్రాయపడ్డారు. సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై శనివారం ఎంసీహెచ్చార్డీలో జరిగిన సదస్సులో వారు మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలను రూపొందిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని, ప్రాంతాలవారీగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. దేశంలో స్టార్టప్‌లను, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉన్నదని వారు పేర్కొన్నారు.

108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles