ఐక్యతతోనే వీరశైవుల అభివృద్ధి


Mon,November 30, 2015 02:41 AM

Lingayat Veerashaiva compound

-వీరశైవ లింగాయత్ సమ్మేళనంలో కేంద్ర మంతి దత్తాత్రేయ
నాంపల్లి: వీరశైవ కులస్తులు ఐక్యతతో అభివృద్ధి సాధించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం అఖిలభారత వీరశైవ తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ ప్రాంగణంలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన వీరశైవ లింగాయత్ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ శాంతి కోసం బసవేశ్వరుడు కృషి చేశారని దత్తాత్రేయ కొనియాడారు.

vira-shivalingayat


ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్‌ను వీరశైవ వైజ్ఞానిక రత్న పురస్కారంతో, కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి శివశ్రీ భీమన్నఖండ్రేను వీరశైవ ధర్మరత్న బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీమద్ శ్రీశైల జగద్గురు, అఖిలభారత వీరశైవ మహాసభ కార్యదర్శి కేఎన్ జయలింగప్ప, మహాసభ తెలంగాణ గౌరవాధ్యక్షుడు ఎం వీరమల్లేశ్, అధ్యక్షుడు నేతి మహేశ్వర్, ఉపాధ్యక్షుడు జగదేవ్ హెర్మత్, సెక్రటరీ జనరల్ డీ బాబూరావు, ఎల్ వీరప్ప, ఎం బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

2068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS