లైంగిక దాడి, హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు


Wed,August 14, 2019 01:08 AM

life-sentence-in-rape-and-murder-case

గుడిహత్నూర్ రూరల్: మహిళపై లైంగికదాడి ఆపై హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారని గుడిహత్నూర్ ఎస్సై వెంకన్న తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా పరిధిలోని సింగర్‌వాడిగూడకు చెందిన కుర్సింగ ధర్మ, చిన్నమన్నూర్‌కు చెందిన కుర్సింగ వెంకట్ గుడిహత్నూర్ మండలంలోని మన్నూ ర్ గ్రామంలో పని చేసేవారు. మన్నూర్‌కు చెందిన కేంద్రె రంజన(42) 2013 అక్టోబర్ 6న కట్టెల కోసం వెళ్లగా.. ధర్మ, వెంకట్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. వారిని గుర్తుపట్టకుండా ఉండేందుకు రంజన కనుగుడ్లను పెకిలించేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన తొడసం ముకుందరావు సైతం రంజనపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ధర్మ, వెంకట్ ఉరివేసి చంపి, శవాన్ని గ్రామంలోని పాఠశాల వద్ద పడేశారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో నిందితులకు రూ.500 చొప్పున జరిమానా, జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్టు ఎస్సై తెలిపారు. ముకుందరావుపై నేరం రుజువు కాకపోవడంతో కొట్టివేశారని ఆయన పేర్కొన్నారు.

102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles