నేటినుంచి లాసెట్ కౌన్సెలింగ్

Thu,October 10, 2019 02:25 AM

-లా కాలేజీలకు ఆలస్యంగా అనుమతించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని లా కాలేజీలలో 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అందుకు సంబంధించి లాసెట్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లాసెట్ ద్వారా ఎల్‌ఎల్‌బీ (మూడు సంవత్సరాలు/ ఐదు సంవత్సరాలు), ఎల్‌ఎల్‌ఎం కోర్సు లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. లాసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌లో మూడు, వరంగల్‌లో ఒక్కటి చొప్పున సహాయకేంద్రాలను ఏర్పాటుచేశామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లో జేఎన్టీయూహెచ్, నిజాం కాలేజీ, కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కేఎంఐటీ), వరంగల్‌లో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, కేయూలో సహాయకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అడ్మిషన్ వివరాలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ కోసం లాసెట్-2019 అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కన్వీనర్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి లా కాలేజీలకు అనుమతి ఇవ్వడంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆలస్యం చేసిందని, అందువల్ల కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆలస్యమైందని కన్వీనర్ పేర్కొన్నారు.

192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles