ఆర్టీఐ ఆన్‌లైన్ వ్యవస్థ ప్రారంభించండి

Sun,October 13, 2019 01:29 AM

-హైకోర్టులో పిల్ దాఖలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సమాచార హక్కు చట్టం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు వీలుగా ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆన్‌లైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే దరఖాస్తులు, అప్పీల్స్, పేమెంట్లు అందులోనే చేసుకోవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన 17 రకాల సమాచారాన్ని కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రాష్ట్ర సమాచార కమిషన్ డిప్యూటీ సెక్రటరీని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

73
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles