తొమ్మిది గుంటలు మాయం


Thu,May 16, 2019 03:00 AM

Land not registered in new passbooks

కొత్త పాస్‌బుక్కుల్లో నమోదు కాని భూమి
సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: కొండాపూర్ మండలం అలియాబాద్ శివారులో 57/రూ సర్వే నెంబర్‌లో 2013లో మంగళి అనసూయ అనే మహిళా రైతు నుంచి 9 గుంటల భూమిని కొంపల్లికి చెందిన చెన్నమనేని రామకృష్ణ కొనుగోలు చేశాడు. 2017 వరకు ఆన్‌లైన్‌లో, రెవెన్యూ రికార్డుల్లో ఉన్నది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ఆ తొమ్మిది గుంటల భూమిని రెవెన్యూ అధికారులు మాయం చేశారు. ఆందోళన చెందిన రైతు వెంటనే వీఆర్వోను కలిసి ప్రొసీడింగ్స్‌లో ఉన్నా.. పాత పాస్‌పుస్తకాల్లో నమోదైనా.. కొత్త పాస్‌పుస్తకాల్లో ఎందుకు రాలేదని అడుగగా దరఖాస్తు చేసుకొంటే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని చెప్పారు. దీంతో దరఖాస్తు చేసుకొన్నాడు. ఏడాదిన్నరగా భూమిని రికార్డుల్లోకి ఎక్కించకుండా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిప్పుకొంటున్నారు.


రామకృష్ణహరిపవన్, రైతు

కొనుగోలు భూమిని రికార్డులో ్ల ఎక్కించాలి

గ్రామానికి చెందిన మంగళి అనుసూయ నుంచి 57సర్వే నంబర్‌లలో మొత్తం 1.9 గుంటల భూమిని 2013లో కొనుగోలు చేశాను. అదే రైతుకు చెందిన 57/ఊ3 సర్వే నంబర్‌లో 10గుంటలు, 57/రులో 30 గుంటలు, 57/రూలో 9గుంటల భూమిని ఏకకాలంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రికార్డులతో వీఆర్వోకు పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నా. తాసిల్దార్ కార్యాలయం నుంచి ప్రొసీడింగ్స్ జారీచేసి పట్టా పాస్‌పుస్తకాల్లో నమోదుచేశారు. రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2017లో ప్రవేశపెట్టిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళనను రెవెన్యూ అధికారులు నీరుగార్చి కొత్త సమస్య తెచ్చిపెట్టారు. రికార్డులలో ఉన్న భూములను తొలిగించి ఊరి పేరు, రైతుపేరు, గ్రామం పేరు చిన్నచిన్న తప్పులను తెరపైకి తెచ్చారు. పాత రికార్డులలో ఉన్న నా భూమి వివరాల ఆధారంగా కొత్తపాస్‌బుక్‌ను జారీ చేయాలి.
- రామకృష్ణహరిపవన్, రైతు, అలియాబాద్, కొండాపూర్బలరాం, తాసిల్దార్

నా దృష్టికి రాలేదు

భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం ఓ సర్వే నంబర్‌లోని భూమి తగ్గిందన్న విషయం నా దృష్టికి రాలేదు. సర్వేకు ముందు పాత పట్టాదారు పాస్‌పుస్తకం, తాసిల్దార్ కార్యాలయం నుంచి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో సర్వే నంబర్‌తో పాటు భూమి విస్తీర్ణం నమోదై ఉన్నాయని, కొత్త పాస్‌పుస్తకంలో నమోదు కాలేదని రైతు తనను కలిస్తే పని వెంటనే జరిగిపోయేది. భూ యజమాని వెంటనే నన్ను సంప్రదిస్తే రికార్డుల్లో నమోదు చేస్తాం.
- బలరాం, తాసిల్దార్, కొండాపూర్

113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles