సమాచారశాఖది కీలకపాత్ర


Mon,August 26, 2019 01:09 AM

kv ramana chary unveiled retired employees book

ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా పనిచేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. సర్కారు కార్యక్రమాలను వివిధ సాధనాల ద్వారా ప్రచారం చేయడంలో ఈ శాఖ కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. సమాచార, ప్రజా సంబంధాలశాఖలో పదవీ విరమణ ఉద్యోగుల కోసం ఆదివారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో రమణాచారి మాట్లాడుతూ.. ఈశాఖ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు. సమాచార, ప్రజాసంబంధాల శాఖ మాజీ కమిషనర్ ఎంవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ తమ శాఖ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరి సమాచారాన్ని కలిపి రూపొందించిన పుస్తకాన్ని రమణాచారి విడుదలచేశారు.

169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles