ఆపద్బాంధవుడు.. కేటీఆర్


Wed,May 22, 2019 02:15 AM

KTR sanctioned Rs 2 76 lakhs from CMRF

-ఇద్దరి అత్యవసర వైద్యచికిత్సలకు ఆపన్నహస్తం
-శిశువు ఆపరేషన్‌కు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.2.5 లక్షలు
-రోడ్డు ప్రమాద బాధితుడి చికిత్సకు రూ.2.76 లక్షల ఎల్వోసీ జారీ
-కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధితుల కుటుంబీకులు

మెట్‌పల్లిరూరల్/ సిరిసిల్లటౌన్: ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంలో ఎల్లప్పుడూ ముందుండే మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.. తాజాగా ప్రాణాపాయస్థితిలో ఉన్న మరో ఇద్దరికి ఆర్థికసాయం అందించి మరోమారు మానవత్వాన్ని చాటుకున్నారు. పెద్దపేగు మూసుకుపోయి పుట్టిన శిశువు ఆపరేషన్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2.5 లక్షలు మం జూరుచేశారు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై ప్రాణాపాయస్థితిలో ఉన్న పేద యువకుడి చికిత్సకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.2.76 లక్షల ఎల్వోసీ దవాఖానకు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రంగారావుపేటకు చెందిన కేశవేణి మధు, సుమితారాణి దంపతులకు మే 8న మెట్‌పల్లిలో మగబిడ్డ జన్మించాడు. శిశువుకు పెద్దపేగు మూసుకుపోయిందని, ఆపరేషన్ ద్వారా రంధ్రం ఏర్పాటుచేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.

డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థికస్థోమత లేని దంపతులు సోషల్ మీడియాలో తమకు సాయం అందించాలని కోరారు. స్పందించిన హైదర్‌నగర్‌లోని ది నెస్ట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఉద్యోగులు, మెట్‌పల్లిలోని సురేందర్ ఫౌండేషన్ వారు రూ.లక్షన్నర దాకా విరాళాలు సేకరించి అందించారు. మిగతా మొత్తం కోసం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు డాక్టర్ సంజయ్, టీఆర్‌ఎస్ సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ద్వారా కేటీఆర్ కార్యాలయాన్ని సంప్రదించారు. వెంటనే కేటీఆర్ స్పందించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.2.5 లక్షలు విడుదల చేయించారు. దీంతో చిన్నారి సర్జరీ విజయవంతం కాగా, వారి కుటుంబం మంగళవారం రాత్రి సంతోషంగా ఇంటికి చేరుకున్నది. బాధిత కుటుంబసభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

shiva

యువకుడి ప్రాణాలు నిలబెట్టారు..

రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని బీవైనగర్‌కు చెందిన గుల్లె శివ (20) రెండ్రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతడిని కరీంనగర్‌లోని మెడికేర్ దవాఖానకు తరలించారు. వైద్య ఖర్చులకు రూ.2.76 లక్షలు అవసరమని వైద్యులు సూచించారు. శివ తండ్రి బుచ్చిలింగం నిరుపేద చేనేత కార్మికుడు కావడంతో వైద్య ఖర్చుల కోసం అవస్థలు పడ్డారు. స్థానిక టీఆర్‌ఎస్ నేత గడ్డం భాస్కర్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు విషయం తెలిపారు. స్పందించిన కేటీఆర్.. రూ.2.76 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ నుంచి ఎల్వోసీ మంజూరుచేశారు. బాధిత కుటుంబసభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

2999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles