మాయాకూటమిని నమ్మొద్దు


Thu,December 6, 2018 03:06 AM

KTR Roadshow In Vemulawada And Gangadhara

-టీఆర్‌ఎస్ సెంచరీ కొట్టుడు ఖాయం
-ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని రాహుల్ అనడం సిగ్గుచేటు
-టీఆర్‌ఎస్ అంటే పేదల స్కీంల పార్టీ
-కేసీఆర్‌తోనే రాష్ట్రం ముందర వడ్తది
-వేములవాడ, సిరిసిల్ల, గంగాధర రోడ్‌షోలో మంత్రి కేటీఆర్
-11న ప్రతిపక్షాలు తట్టాబుట్టా సర్దుకొని పోవాల్సిందే

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ప్రతినిధులు, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సెంచరీ కొట్టడం ఖాయం. ఈ నెల 11న చంద్రబాబు, రాహుల్‌గాంధీలాంటి టూరిస్టులంతా తట్టాబుట్టా సర్దుకొని ఇంటికి పోవాల్సిందే. జక్కయ్య, తుమ్మయ్యలాంటోళ్లు సర్వేలతో ఆగం చేస్తున్నా మనం వంద సీట్లు గెలుస్తున్నాం అని మంత్రి, సిరిసిల్ల అభ్యర్థి కే తారకరామారావు స్పష్టంచేశారు. మాయమాటలతో, మొసలికన్నీళ్లతో మోసంచేయడంలో కాంగ్రెస్ నేతలు పీజీ కోర్సులు చేశారని ఎద్దేవాచేశారు. కూటమి నేతలను నమ్మి మోసపోవద్దని సూచించారు. బుధవారం వేములవాడ, సిరిసిల్ల, గంగాధరలో రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ రాహుల్‌గాంధీ మాట్లాడడం సిగ్గుచేటని, దేశంలో ఎమర్జెన్సీ విధించింది మీ నాయనమ్మ ఇందిరాగాంధీయేనని మర్చిపోయావా అని ధ్వజమెత్తారు.
GANGADHARA-KTR1
టీఆర్‌ఎస్ పార్టీ పేదల కోసం వివిధ స్కీంలను అమలుచేసే పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ స్కాంల పార్టీ అని పోల్చారు. దేశానికి పట్టిన శని, ఇటలీ బొమ్మ అంటూ విమర్శలు చేసిన చంద్రబాబుతో రాహుల్‌గాంధీ పొత్తు పెట్టుకోవడం, పాము, ముంగీసలు ఒక్కటికావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 60 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏమి చేసిందని ప్రశ్నించారు. కరెంటు ఇవ్వాలని అడిగితే కాల్చిచంపినోళ్లకా? అడుగకముందే 24 గంటల ఉచిత కరంటు ఇస్తున్న కేసీఆర్‌కు ఓటేస్తారా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. 14 ఏండ్లపాటు కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌తోనే తెలంగాణ ముందుకుపోతుంది తప్ప.. చంద్రబాబుతోనో, మరొకరితోనే అది సాధ్యం కాదని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ను మరోసారి బలపర్చి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తిచేశారు. రోడ్‌షోలో వేములవాడ టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు, చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్‌తోపాటు ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నామాల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, కనవేణి చక్రధర్‌రెడ్డి, ఆనం శశిధర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిందం చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.
GANGADHARA
GANGADHARA-KTR2

961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS