సభ్యత్వ నమోదుపై నేడు కేటీఆర్ సమీక్ష


Thu,August 22, 2019 02:02 AM

KTR Review Today On Membership Registration

-కమిటీల నియామకం, కార్యాలయాల నిర్మాణ పురోగతిపై చర్చ
-హాజరుకానున్న సభ్యత్వాల, భవనాల నిర్మాణ ఇంచార్జీలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు గురువారం సమీక్షించనున్నారు. వివిధ కమిటీల నియామకంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణ పురోగతిపై పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జీలను అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణభవన్‌లో ఉద యం నిర్వహించే సమావేశానికి పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్జీలు, పార్టీ కార్యాలయాల భవనాల నిర్మాణ ఇంచార్జీలు, డాటా ఎంట్రీ ఇంచార్జీలు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పటికే పూర్తయింది. బూత్, గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇటీవల జరిపిన సమీక్ష సమావేశం నాటికి పార్టీ సభ్యత్వ నమో దు 50 లక్షలు పూర్తయింది. బోనాలు తదితర పండుగలు రావడంతో సభ్యత్వ నమోదు గడువును ఈ నెల 10 వరకు పెంచారు. వీటన్నింటి నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జీలతో కేటీఆర్ సమీక్ష జరుపనున్నారు.

గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో బూత్, గ్రామ కమిటీల ఎన్నిక పూర్తికావచ్చింది. మరికొన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. అలాగే, దసరా పండుగ నాటికి జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలను పూర్తిచేయాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే కార్యాలయాల భవనాల నిర్మాణ నమూనా, నిర్మాణానికయ్యే వ్యయా న్ని పార్టీ ఫండ్ నుంచి నిధులను చెక్కుల రూపంలో అందించారు. కార్యాలయాల భవనాల నిర్మాణం పనులు ఎక్కడిదాకా వచ్చాయి..? ఎప్పటిలోగా పూర్తవుతాయి..? అనే విషయాలపై కేటీఆర్ మాట్లాడుతారు. నిర్మాణం పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పడంతోపాటు పలు సూచనలు చేయనున్నట్టు తెలిసింది.

314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles