ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోనే కాళేశ్వరం సాకారం


Thu,July 18, 2019 02:11 AM

KTR Praises CM KCR Over Kaleshwaram Project In His Tweets

-తక్కువ వరద సమయంలోనే 11 టీఎంసీల ఎత్తిపోత
-సమృద్ధిగా ఇన్‌ఫ్లో వస్తే తెలంగాణ సస్యశ్యామలం
-ఉద్యమ నాయకుడే సీఎం కావడం వల్ల చేకూరిన లబ్ధి
-ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికత వల్లనే దేశంలోనే అద్భుతమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సాకారం అయిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. గత కొన్నిరోజులుగా కాళేశ్వరం ఎత్తిపోతలలో కన్నెపల్లి పంపుహౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోత కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిరంతరాయంగా సాగుతున్న ఈ ప్రక్రియతోపాటు మేడిగడ్డ బరాజ్‌లోనూ గోదావరి జలాల్ని ఒడిసిపట్టడంతో మునుపటికి భిన్నంగా కిలోమీటర్ల మేర గోదావరి సజీవంగా దర్శనమిస్తున్నది. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్.. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణకు చేరిన లబ్ధి ఇది అంటూ పేర్కొన్నారు. ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, అసలు గోదావరిలో ఏమాత్రం వరద రాని సీజన్‌లో ప్రాణహిత నదిలో వస్తున్న వరద నీటిని అయిదు మోటర్ల ద్వారా ఎత్తిపోసి.. పదిరోజుల్లో 11 టీఎంసీల నీటిని ఒడిసిపట్టి నిలువ చేశాం.

దీనితో కనీసం లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే. వర్షాలు కురిసి, వరద పెరిగి అన్ని మోటర్లు మొదలైతే తెలంగాణలో బీళ్లన్నీ గోదావరి నీటితో సస్యశ్యామలం అవుతాయి. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ధి ఇది అని ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు. అదేవిధంగా దేశంలోని చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉన్నదని, అయితే హైదరాబాద్ నగరానికి మాత్రం అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశమే లేదన్నారు. కాళేశ్వరం ప్రారంభమైన దరిమిలా ఆ జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయని, చెన్నై తరహా నీటి కష్టాలు హైదరాబాద్‌కు ఎప్పుడూ రాకుండా చూసుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.

నీటి కష్టాల వార్తలు అవాస్తవం

సినీ దర్శకుడు మారుతి ట్వీట్‌కు కేటీఆర్ స్పందన
హైదరాబాద్‌కు నీటి కష్టాలు వస్తాయంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. 48 రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో నీరుండదని, చెన్నై మాదిరి కరువును ఎదుర్కోవాల్సి వస్తుందన్న వార్తలపై సినీ దర్శకుడు మారుతి సైతం స్పందిస్తూ ఈ వార్త నిజమేనా సర్ అంటూ ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌ను అడిగారు. కేటీఆర్ స్పందిస్తూ.. ఆ వార్తలన్నీ అవాస్తవం. రెండువారాల్లో కాళేశ్వరం నీరు ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి వస్తుంది. తద్వారా హైదరాబాద్‌కు రోజూ 172మిలియన్ గ్యాలన్ల నీరు అందుతుంది. ప్రజలు కూడా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అని పేర్కొన్నారు.

987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles