మున్సిపల్ చట్టంపై అవగాహన తేవాలి


Thu,September 12, 2019 03:09 AM

KTR holds review of municipal affairs

-ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకు అర్థంకావాలి
-మున్సిపల్ విభాగాధిపతుల సమావేశంలో మంత్రి కేటీఆర్ సూచన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పురపాలక చట్టంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకు అర్థమైనప్పుడే అధికారుల్లో పారదర్శకత పెరుగుతుందని, ప్రజల్లో పురపాలన పట్ల చైతన్యం వస్తుందని చెప్పారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలకశాఖ కార్యాలయంలో పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన పురపాలికల్లోని ప్రజలకు నూతన చట్టంపై మరింత అవగాహన తీసుకురావాలని మంత్రి సూచించారు. పురపాలనపై ప్రభుత్వ ఆలోచనలను వివరించేందుకు త్వరలో అన్ని మున్సిపల్ కమిషనర్లతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పురపాలకశాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి వివరించారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles