కేటీఆర్ ఔదార్యం


Fri,February 22, 2019 02:14 AM

ktr helps Rs 50000 cheque to the orphan boy

-నిరుపేద కుటుంబానికి భరోసా
-రూ.లక్ష ఆర్థికసాయం అందజేసిన కేటీఆర్ పీఎం గన్‌రాజ్
-అనాథ బాలుడికి రూ.50వేల చెక్కు అందజేత
-చిన్నారి చదువుకు సాయం

సిరిసిల్ల టౌన్/గంభీరావుపేట: ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకుంటూ.. బాధితులకు భరోసా కల్పిస్తున్నారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. కష్టాల్లో ఉన్నామని విన్నవించేవారి సమస్యలపై వెనువెంటనే స్పందిస్తూ తక్షణ సాయం అందిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన ఇమ్మిడిశెట్టి వైకుంఠం, కల్యాణి దంపతులు 30 ఏండ్ల కిందట బతుకుదెరువు కోసం సిరిసిల్లకు వలస వచ్చి స్థిరపడ్డారు. వైకుంఠం నేత కార్మికుడిగా, కల్యాణి బీడీలు చుడుతూ కొడుకు సాయికృష్ణ, కూతురు మౌనికను చదివిస్తున్నారు. గతనెల 28న వైకుంఠం గుండెపోటుతో మరణించాడు. అద్దె ఇల్లు కావడంతో ఇంటి యజమానులు మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురానివ్వలేదు. దీంతో స్థానిక ప్రజాప్రతిధులు.. వార్డులోని కమ్యూనిటీ భవనంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు.

భర్తను కోల్పోయి, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న తమకు సాయంచేయాలని కల్యాణి.. బుధవారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నివేశనా స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌ను కలిసి విన్నవించింది. స్పందించిన ఆయన బాధిత కుటుంబానికి ఆర్థిక సహకారం అందించాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో కేటీఆర్ పీఏ గన్‌రాజ్.. కల్యాణికి రూ.లక్ష చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్నామని చెప్పగానే తోడ బుట్టిన అన్నోలె ఆదుకున్నాడని కన్నీటి పర్యంతమైన కల్యాణి.. జీవితకాలం కేటీఆర్ సార్‌కు రుణపడి ఉంటానని చెప్పింది.

అనాథ బాలుడికి రూ.50 వేలు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేటకు చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు ఆవునూరి బాబయ్య ఎనిమిది నెలల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. ఏడాది కిందట అతని భార్య మృతిచెందింది. వీరి నాలుగేండ్ల కుమారుడు హర్షవర్ధన్ అనాథగా మారాడు. బుధవారం దమ్మన్నపేటకు వచ్చిన కేటీఆర్‌ను బాబయ్య తల్లిదండ్రులు గంగయ్య, బాబవ్వ కలిశారు. అనాథగా మారిన మనువడిని ఆదుకోవాలని కోరారు. హర్షవర్ధన్‌ను చూసి చలించిన కేటీఆర్ వారికి రూ.50 వేల ఆర్థిక సాయంచేయాలని ఆదేశించారు. గురువారం సిరిసిల్లలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పీఏ గన్‌రాజ్ రూ.50 వేల చెక్కును చిన్నారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అరుట్ల అంజిరెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు హన్మంతరెడ్డి, గ్రామస్తుడు చంద్రమౌళి ఉన్నారు.

చిన్నారి చదువుకు సాయం

సిరిసిల్ల టీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు సుద్దాల భారతి తన కొడుకు ప్రభాస్ చదువు కు సహకరించాలని ఇటీవల కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదేశం మేరకు ఆయన పీఎ గన్‌రాజ్ కలెక్టరేలో ఫీజుకు అవసరమైన రూ.15వేల చెక్కును తల్లి భారతికి అందజే శారు. అదేవిధంగా ప్రభాస్ పేరున డిపాజిట్ కోసం రూ.50వేల చెక్కును అందజేశారు.

779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles