గాంధీ దవాఖానలా గాంధీభవన్


Wed,November 14, 2018 01:58 AM

ktr fires on mahakutami over mahakutami

-ఎమ్మెల్యే టికెట్ల కోసం స్లైన్ బాటిళ్లతో దీక్షలా!
-సీట్లే పంచుకోలేని కూటమి ఏం ఉద్ధరిస్తుంది?
-గాంధీభవన్ కూల్చేస్తారనే అర్ధరాత్రి సీట్ల ప్రకటన
-జిల్లాల్లో దివ్యాంగులకు భవనాలు..ఐటీ పార్కులు
-దివ్యాంగ పెన్షనర్ల సభలో మంత్రి కేటీఆర్ హామీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:గాంధీభవన్‌ను చూస్తుంటే గాంధీ దవాఖానను తలపిస్తున్నది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటూ ఆశావహులు స్లైన్ బాటిళ్లు పెట్టుకుని దీక్షలు చేస్తున్నరు. సీట్లు పంచుకోవడమే చేతకానివాళ్లు, అధికారంలోకి వస్తే ఏం పాలన అందిస్తారు అని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మంగళవారం ది వ్యాంగ పెన్షనర్ల కృతజ్ఞత సభను వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పగటిపూట సీట్లు ప్రకటించే ధైర్యం కాంగ్రెస్ నేతలకు లేదని, గాంధీభవన్‌ను కూలగొడ్తారనే భయంతోనే అర్ధరాత్రి జాబితా విడుదల చేశారని విమర్శించారు. కూటమిలో సీట్లే పంచుకోలేనివారు ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే నాలుగు పైసలకు కూటమి నేతలు ఆశపడుతున్నారని, తెలంగాణ అభివృద్ధిని, ప్రాజెక్టులను అడ్డుకునే చంద్రబాబు ఇక్కడి సీట్ల కేటాయింపులో ఎందుకు కీలకమయ్యాడని ప్రశ్నించారు.

చంద్రబాబు చేతిలోనే కాంగ్రెస్ కూటమి జుట్టు ఉం దని, ఏపీ సీఎం చేతిలో తెలంగాణ భవిష్యత్తును ఎలా పెడుతారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు అడ్డంపడి, కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు తెలంగాణను నాశనం చేసేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. కూటమికి ఓటేస్తే ప్రాజెక్టులను అడ్డుకున్నట్టేనని, ఇప్పుడు తప్పుచేస్తే బతుకు ఆగమవుతుందని చెప్పారు. ఉద్యమస్ఫూర్తితో తెలంగాణ ప్రయోజనాలు కాపాడే టీఆర్‌ఎస్‌కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎప్పటికీ ప్రత్యర్థేనని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో బీజేపీని ఓడిస్తామని చెప్పారు. కేంద్రంతో వైరం ఉన్నప్పటికీ, సీఎం కేసీఆర్ పాలనను ప్రధాని, కేంద్ర మంత్రులు కొనియాడారని గుర్తుచేశారు.

ఏపీ కలిశాకే ఫ్లోరోసిస్ సమస్య

కాంగ్రెస్ నాయకులు ఆస్తులు పెంచుకున్నారే తప్ప, ఫ్లోరోసిస్‌తో జీవచ్ఛవాలుగా మారినా 70 ఏండ్లలో గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులు రెండులక్షలకు పైగా ఉన్నారని, అక్కడి నుంచే జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నప్పటికీ ఉపయోగంలేదన్నారు.1956లో ఏపీ, తెలంగాణ కలువక ముం దు నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య లేదని, కానీ ఉమ్మడి పాలన మొదలైన తర్వాత కృష్ణా జలాలన్నీ ఆంధ్రాకు తరలించుకుపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. తలాపున కృష్ణమ్మ పారుతున్నప్పటికీ నల్లగొండకు మంచినీరివ్వలేదని, భూగర్భ జలాలపై ఆధారపడడంతో ఫ్లోరిన్‌పైకి వచ్చి ప్రజలను జీవచ్ఛవాలుగా మార్చిందని ఆవేదనవ్యక్తం చేశారు. కేంద్రస్థాయిలో చక్రం తిప్పుతామని గొప్పలు చెప్పే నల్లగొండ కాంగ్రెస్ నేతలదే ఈ పాపమని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ బాధల నుంచి విముక్తి చేశారని, నెలాఖరులోగా ఇంటింటికీ నీళ్లు అందుతాయని చెప్పారు.టీఆర్‌ఎస్‌కు దివ్యాంగులు మద్దతుగా ఉంటారని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి చెప్పారు. దివ్యాంగుల కోసం కోట్ల నిధులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంస్థ వీహెచ్‌పీఎస్ రాష్ట్ర నేత లక్కిరెడ్డి సత్యం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సమావేశంలో ఆవుల వెంకట్, నల్లగొండ శ్రీనివాస్, సత్యం, జన్ను రాజు, నదీం, నయీంపాషా, రాజిరెడ్డి, ప్రసాద్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

పథకాలపై దివ్యాంగుల ప్రచారం

టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి వివరించేందుకు వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రచారానికి దివ్యాంగులు సిద్ధమవుతు న్నారు. జిల్లాస్థాయిల్లో ప్రత్యేక దివ్యాంగుల బృందాలు ప్రచారం ప్రారంభిస్తాయని వాసుదేవరెడ్డి తెలిపారు. జలవిహార్‌లో దివ్యాంగ పెన్షనర్ల కృతజ్ఞత సభలో కరపత్రాన్ని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. దివ్యాంగుల్లో ఉన్న కళాకారులతో రెండు బృందాలను అన్ని నియోజకవర్గా ల్లో ప్రచారానికి ఎంపికచేసినట్టు, జిల్లాస్థాయిలో మరిన్ని బృందాలను ఏర్పాటుచేసినట్టు వాసుదేవరెడ్డి తెలిపారు.

ktr-gandhi-bhavan2"title="ktr

దివ్యాంగుల సంక్షేమంలో మనమే నంబర్‌వన్

దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. నాలుగురోజుల కిందట దివ్యాంగుల సంక్షేమంలో జాతీయస్థాయిలో రాష్ర్టానికి అవార్డు వచ్చిందని, దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులను వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. దివ్యాంగుల బడ్జెట్‌ను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తానని హామీఇచ్చారు. రాష్ట్రంలో 2.62 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణమవుతున్నాయని, ది వ్యాంగులకు ప్రత్యేక కోటా ఏర్పాటుచేస్తామన్నారు. మహి ళా శిశుసంక్షేమశాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను వేరుచేయడంలో సాంకేతిక ఇబ్బందులున్నాయని, ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని హామీఇచ్చారు. కేసీఆర్‌ను గెలిపించుకోవాలనే పట్టుదలతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన దివ్యాంగుల స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

పేదల కోసం 453 పథకాలు అమలుచేశామని, డిసెంబర్ 11 తర్వాత సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాగానే దివ్యాంగుల పెన్షన్ పెరుగుతుందని భరోసా కల్పించారు. ఏటా రూ. 880 కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నామని, దివ్యాంగులకు రూ.10 కోట్ల వరకు సబ్సిడీ రుణాలు ఇచ్చామని చెప్పారు. ప్రత్యేకంగా ఐటీ పార్కులు, ప్రతి జిల్లాల్లో దివ్యాంగులకు భవనాలు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

1170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles