సౌదీలో తెలంగాణవాసి సమీర్‌కు కష్టాలు


Thu,May 16, 2019 03:01 AM

KTR comes to rescue of another TS youth in Saudi Arabia

రప్పించేందుకు కేటీఆర్ ప్రయత్నాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : సౌదీలో కష్టాలు పడుతున్న తెలంగాణ వాసిని స్వరాష్ర్టానికి రప్పించేం దుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెంది న ఎండీ సమీర్ ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్ రూ. 83వేలు తీసుకొని ఫాంహౌస్‌లో పని అంటూ.. గొర్రెలు కాసే పనిలో పెట్టాడని, యజమాని భోజనం పెట్టకుండా హింసిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన సమీర్ వీడియోను కొందరు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కేటీఆర్.. సమీర్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని సౌదీలో ఇండియన్ అంబాసిడర్, రియాద్‌లోని ఇండియన్ ఎంబసీకి ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు.

1231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles