చిన్నారులకు అండగా మంత్రి కేటీఆర్

Wed,September 11, 2019 02:44 AM

-దివ్యాంగ పెన్షన్‌కు హామీ
-ఆపరేషన్ చేయిస్తామని భరోసా

చిక్కడపలి: మంత్రి కే తారకరామారావు మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలకు ఆర్థికసాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కవాడిగూడకు చెందిన 14 ఏండ్ల బాలుడు సునీల్ మూడేండ్ల క్రితం తీవ్ర జ్వరంతో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఆపరేషన్ చేసినా కోలుకోకుండా మంచానికే పరిమితమయ్యాడు. బాలుడి అవసరాలకు ప్రతినెలా రూ.10 వేలు ఖర్చవుతుండటంతో నిరుపేదలైన తల్లిదండ్రులకు భారంగా మారింది. మరోవైపు, నారాయణగూడకు చెందిన 10వ తరగతి విద్యార్థి డీ మైత్రి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని, అందుకు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. స్వామి వివేకానంద సొసైటీ ఫర్ రూరల్, అర్బన్ డెవలప్‌మెంట్ సంస్థ జాతీయ అధ్యక్షుడు కొడిమల మహేందర్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వారు మంత్రి కేటీఆర్‌ను కలిసి గోడు వినిపించారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితిని చూసి చలించిన మంత్రి.. సునీల్‌కు వికలాంగుల పింఛన్, మెయింటెనెన్స్‌కు డబ్బు సర్కారు అందిస్తుందని, మైత్రి ఆపరేషన్‌కయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వీరి సమస్యను పరిష్కరించాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు.
ktr-disabled2

180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles