వాలంతరీ డైరెక్టర్‌గా కృష్ణారావు బాధ్యతలు


Thu,September 13, 2018 12:45 AM

Krishna Rao is the director of Valandery

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీరు, భూమి నిర్వహణ శిక్షణ పరిశోధన సంస్థ (వాలంతరీ) నూతన సంచాలకుడిగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీ కృష్ణారావు బుధవారం రాజేంద్రనగర్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ సంస్థ అధికారులు, శాస్త్రవేత్తలు, సిబ్బంది కృష్ణారావుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాలంతరిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.

319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles