స్వరాష్ట్రంలో గురుకులాలు పటిష్ఠం


Tue,April 16, 2019 01:26 AM

koppula eshwar launches Summer Samurai Camp

సమ్మర్ సమురాయ్ క్యాంప్ ప్రారంభోత్సవంలో మంత్రి కొప్పుల
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గురుకుల విద్యాలయాలు పటిష్ఠమయ్యాయని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఉద్యమ సమయం లో కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని కేసీఆర్ చెప్పిన విధంగానే ఇప్పుడు ఉచిత విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. విద్యతోనే సామాజిక ప్రగతి సాధ్యమనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమ్మర్ సమురా య్ క్యాంప్‌ను సోమవారం సచివాలయంలో మంత్రి కొప్పుల నగారా మోగించి ప్రారంభించారు. అనంతరం కరపత్రాలను ఆ విష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దూరదృష్టితో గురుకుల పాఠశాలలను అభివృద్ధిపరుస్తున్నట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు చెందిన చిన్నారులకు మంచి భవిష్యత్తును అందించేందుకు గురుకుల విద్యాలయాలను వినూత్నరీతిలో నిర్వహిస్తున్నారని చెప్పారు.

సమ్మర్ సమురాయ్‌లో ఐటీఐ, నీట్, సీఎల్‌ఏటీ వంటి పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నట్టు మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం, సీఎం కేసీఆర్ అందిస్తున్న సహకారంతో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాలను వినూత్నంగా నిర్వహిస్తున్నామన్నారు. వేసవి సెలవులు వృథాకాకుండా సమ్మర్ సమురాయ్ పే రుతో గుర్రపుస్వారీ, మార్షల్ ఆర్ట్స్, నృత్యం, సంగీతం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. వెయ్యి మందితో ప్రారంభమైన సమ్మర్ సమురాయ్ శిబిరంలో 50 వేల మంది పాల్గొంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ పాఠ్యాంశాల్లో నేర్చుకున్న వాటి ఆధారంగా వారి గ్రామాల్లో, కుటుంబాల్లో ఉండే సమస్యలపై ప్రాజెక్టు రిపోర్టును రూపొందించే బాధ్యతను1.50 లక్షల మంది విద్యార్థుల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి బెనహర్ మహేశ్‌దత్ ఎక్కా, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్ పీ కరుణాకర్ పాల్గొన్నారు.

487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles