నేడు కుమ్రంభీం వర్ధంతి

Sun,October 13, 2019 01:51 AM

-ఆసిఫాబాద్ జిల్లా జోడెఘాట్‌లో ఏర్పాట్లు
కెరమెరి/సిర్పూర్(యు): అడవితల్లి ముద్దుబిడ్డ కుమ్రంభీం 79వ వర్ధంతిని ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు.. ఐటీడీఏ పీవో కృష్ణాదిత్య, ఎస్పీ మల్లారెడ్డితో కలిసి శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని కృష్ణాదిత్య తెలిపారు. ముందుగా హట్టికి వెళ్లి బేస్‌క్యాంపు వద్ద భీం విగ్రహానికి నివాళులర్పిస్తారని, అక్కడినుంచి జోడేఘాట్ చేరుకొని ఆదివాసీల ఆచార వ్యవహారాలతో జరిగే పూజలో పాల్గొంటారని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే గిరిపుత్రులకు ఇబ్బందులు కలుగకుండా హట్టి నుంచి జోడెఘాట్ వరకు 5 బస్సులను నడిపిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ మల్లారెడ్డి ఆదేశాలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. హట్టి నుంచి జోడెఘాట్ వరకు అటవీప్రాంతాన్ని అడుగడుగునా తనిఖీ చేసి, ప్రత్యేక నిఘా పెట్టారు. కలెక్టర్ వెంట ఏఎస్పీ సుదీంద్ర, ఆర్డీవో దత్తు, తాసిల్దార్ ప్రమోద్, ఎంపీడీవో మహేందర్, ఉత్సవ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, ఎంపీపీ మోతిరాం ఉన్నారు. ఆదివారం కుమ్రం సూరు వర్ధంతి కూడా ఉండటంతో ముందుగా గిరిజనులు అవ్వల్ పేన్ పూజలు చేశారు.

410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles