కోల్‌కతా కేంద్రంగా సెక్స్‌రాకెట్


Sun,August 13, 2017 10:26 AM

Kolkata based sex racket

ఏడుగురిని అరెస్టుచేసిన సైబరాబాద్ పోలీసులు
Sexraket
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆర్థిక ఇబ్బందులు, అవకాశాలు లేని జూనియర్ ఆర్టిస్టులు, మోడల్స్‌ను డబ్బులతో ఎరవేసి విలాసాలకు బానిసలను చేసి అనేక రాష్ర్టాలు తిప్పుతూ వ్యభిచారం చేయించే ఓ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టుచేశారు. ఈ నెల 9న మాదాపూర్ సైబర్ హిల్స్ మైకాన్స్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతున్నదనే సమాచారంతో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి కొందరిని అరెస్టుచేశారు. వీరిచ్చిన సమాచారంతో కర్ణాటక, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా పోలీసుల సహకారంతో ఆయారాష్ట్రాల్లో దాడులుచేసి మొత్తం ఏడుగురు నిర్వాహకులను అరెస్టుచేసి శనివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నిందితుల్లో దంపతులు రాజేశ్ పర్వాల్, ఆర్తి పర్వాల్‌తోపాటు ఎండీ అఫ్సర్, అజయ్‌కుమార్ చౌదరి, గురురాజు శెట్టి, సోదరులు కల్లూరి శ్రావణ్‌రెడ్డి, కల్లూరి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వీరి నుంచి రెండు మూడు కార్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి సంజయ్ కోసం గాలింపు చేపట్టారు. నలుగురు బాధిత మహిళలను రక్షించారు.

ఖరీదైన ప్రాంతాల్లో దందా: కోల్‌కతాకు చెందిన సంజయ్ ఢిల్లీ, ముంబై, తెలంగాణ, కోల్‌కతా ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వ్యవస్థీకృతంగా మహిళలను అక్రమంగా రవాణా చేస్తూ వ్యభిచార దందాను నడిపిస్తున్నాడు. వ్యభిచారం అంతా ఖరీదైన ప్రాంతాలు, స్టార్ హోటళ్లలోనే జరుగుతుంది. ఒక్కరోజు కిరాయి కోసమే రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చుచేస్తారు.

మహిళలను తరలించేందుకు విమానాలు, హై ఎండ్ కార్లనే ఉపయోగిస్తారు. వీరి నెట్‌వర్క్‌లోని వాట్సప్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లో మహిళ ఫొటో, ఫోన్‌నంబర్, ధరను పోస్టు చేస్తారు. ఏడు రాష్ర్టాల్లో ఉన్న ముఠా సభ్యులకు ఎక్కడ చిక్కినా మిగతా రాష్ర్టాల్లో తిప్పుతూ దందా నిర్వహిస్తున్నారు. విటులను ఆకర్షించేందుకు 50 వెబ్‌సైట్లు రూపొందించారు. పదిరోజులపాటు సైబరాబాద్ మాదాపూర్ ఎస్వోటీ జోన్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్ సారథ్యంలో చేసిన దర్యాప్తుతో పలు రాష్ట్రాల్లో నడుస్తున్న ఈ దందా గుట్టు బహిర్గతమైంది. పట్టుబడ్డ నిందితుల్లో ఆర్తి కూడా ఒకప్పుడు బాధితురాలే. దందాలో పరిచయమైన రాజేశ్‌ను వివాహం చేసుకుని దందాలో భాగమైంది.

2717

More News

VIRAL NEWS