కొత్త పాస్‌బుక్ ఇప్పించండి


Mon,July 22, 2019 01:57 AM

Khammam Farmers Suffering Revenue Officers Neglect Pattadar Passbook

-భూమి ఉన్నా అందని రైతుబంధు సాయం
-ఖమ్మం జిల్లా వల్లభివాసి పూర్ణచంద్రరావు ఆవేదన

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలోని సర్వే నంబర్ 57/3 యూలో రైతు బిచ్చాల పూర్ణచంద్రరావుకు 1.16 ఎకరాల భూమి ఉన్నది. దీనికి పూర్ణచంద్రరావు పట్టాదారుగా, అనుభవదారుగా ఉన్నారు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పూర్ణచంద్రరావు.. తమ వద్ద ఉన్న పాత రికార్డులన్నీ రెవెన్యూ అధికారులకు చూపించి, కొత్త పాస్‌బుక్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకొన్నారు. కానీ, అధికారులు కొత్త పాస్‌బుక్ ఇవ్వలేదు. 2018 మేలో రైతుబంధు కింద చెక్కును మాత్రమే రైతు చేతిలో పెట్టారు. అక్టోబర్ 2018లో రెండోవిడుతలో రైతుబంధు సాయం కూడా పంపిణీ చేయలేదు. కొత్త పాస్‌బుక్ ఇవ్వకపోవడం, రైతుబంధు సాయం అందకపోవడంతో పూర్ణచంద్రరావు.. పాత పాస్‌బుక్, 13(బీ), ఈ- పహాణీ ప్రతులను పట్టుకొని రెవెన్యూ అధికారులను కలిసి సమస్యను వివరించారు. న్యాయం చేయాలని ఏడాదిగా తిరుగుతున్నా పట్టించుకొనేవారు కరువయ్యారు.

రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా రైతుబంధు సాయాన్ని నష్టపోయానని బాధితుడు చెప్తున్నారు. ఇక అదే సర్వే నంబర్ 57/3లో ఏసు రామదాసు నుంచి 14 గుంటల భూమిని 2009లో కొన్నానని, సాదాబైనామా కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా, దానిని సైతం ఇంతవరకు పాస్‌బుక్‌లో నమోదుచేయలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2019 మేలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుచేసినా అధికారులు స్పందించలేదని, ఖమ్మం ఆర్డీవోకు అప్పీలు చేసుకోగా ఇప్పటివరకు న్యాయం చేయలేదని తెలిపారు. ఇటీవల కలెక్టర్‌ను కలిసినా స్పందన కరువైందని చెప్పారు. దీనిపై స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగలక్ష్మిని వివరణ కోరగా.. డిజిటల్ ప్రకియంతా పూర్తయిందని, పాస్‌పుస్తకాలు చెన్నైలో ముద్రణ అవుతున్నాయని తెలిపారు. పాస్‌పుస్తకాలు రాగానే రైతుకు అందజేస్తామని, పెండింగ్‌లో పెట్టడంలేదని వివరించారు.

108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles