డబ్బులిచ్చినోళ్లకే పాస్‌పుస్తకం


Sat,May 25, 2019 01:37 AM

Khammam Farmer Suffering Revenue Officers Neglect For Land Registration

-బాజాప్తా సొమ్ములు వసూలుచేస్తున్న అధికారులు
-ఖమ్మం జిల్లా రైతు మంకెన రాజేంద్ర ఆవేదన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఖమ్మంజిల్లా ముదిగొండ మండలం సువర్ణపురంకు చెందిన మంకెన రాజేంద్రకు ఖాతా నంబర్ 912లో సర్వే నంబరు 318/ఇలో 4.12 ఎకరాలు, 318ఆ/1లో 1-32 ఎకరాలు, 320/ఈ లో 7 గుంటలు , 320/ఈ2 లో 6 గుంటలు, 314/ఆ లో 2.20 ఎకరాలు, 315/ఆ/2లో 1.20 ఎకరాల భూమి ఉన్నది. వీటికి సంబంధించి కొత్త పాస్‌పుస్తకం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదు. వీఆర్వో దగ్గరకు వెళ్తే, ఆర్‌ఐ లేరు.. ఎమ్మార్వో లేరు.. రేపుమాపు రా అంటూ తిప్పించుకుంటున్నారని రాజేంద్ర వాపోయారు. ఇన్నిసార్లు ఎందుకు తిప్పుతున్నారని ఆరాతీస్తే 315 సర్వే నంబర్‌లో ఉన్న భూమిని పుట్టబర్తిని వెంకటరమణ అనే వ్యక్తికి, 314 సర్వే నంబర్‌లో ఉన్న భూమిని మరో వ్యక్తి పేరు మీదకు మార్చి పట్టాదారు పాస్‌పుస్తకం ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఇదేమని వీఆర్వోను నిలదీస్తే ఎవరు డబ్బులిస్తే వారికే పాస్‌పుస్తకం ఇస్తారని తలబిరుసుగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. తనకు పాస్‌పుస్తకం లేక, రైతుబీమా, రైతుబంధు, బ్యాంకు రుణం రాక తన కూతురు పెండ్లి చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles