కేశంపేట తాసిల్దార్ లావణ్య చంచల్‌గూడ జైలుకు


Fri,July 12, 2019 02:34 AM

Keshampet Tahsildar Lavanya Arrested By ACB Officials

-ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉదయం అరెస్టు
-మధ్యాహ్నం ప్రత్యేక జడ్జి ఎదుట బైండోవర్
-14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి
-సాయంత్రం కారాగారానికి తాసిల్దార్, వీఆర్వో అనంతయ్య

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఉన్న కేసులో రంగారెడ్డి జిల్లా కేశంపేట తాసిల్దార్ మునావత్ లావణ్యను ఏసీబీ అధికారులు గురువారం ఉద యం అరెస్టుచేశారు. అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో లావణ్యను హాజరుపరుచగా.. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. సాయంత్రం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు వీఆర్వో అనంతయ్య బుధవారం ఓ రైతు నుంచి లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. తాసిల్దార్ లావణ్య ఆదేశం మేరకే రైతు నుంచి లంచం తీసుకున్నానని అతడు చెప్పడంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌లోని లావణ్య ఇం ట్లోనూ సోదాలుచేయగా రూ.93 లక్షల నగదు, 40 తులాలకుపైగా బంగారం పట్టుబడింది. రాష్ట్రంలో ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో భారీమొత్తంలో నగదు పట్టుబడటం పదేండ్లలో ఇదే ప్రథమం కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కేసులో ఏసీబీ లోతైన దర్యా ప్తు చేపట్టింది. బుధవారం రాత్రి వరకు హయత్‌నగర్‌లోని లావణ్య నివాసంలో తనిఖీలుచేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం ఆమెను అరెస్టుచేశారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారణ పూర్తయిన తర్వాత లావణ్యను దవాఖానకు తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తర్వాత బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో లావణ్యను హాజరుపరిచారు. న్యాయమూర్తి తాసిల్దార్ లావణ్యతోపాటు వీఆర్వో అనంతయ్యకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, లావణ్య భర్త వెంకటేశ్‌నాయక్ పరారీలో ఉన్నట్టు తెలిసింది. అతడు జీహెచ్‌ఎంసీ పరిపాలనా విభాగంలో పనిచేస్తున్నారు.
lavnaya1

9162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles