మాజీ మంత్రి పాపయ్య కన్నుమూత


Fri,September 8, 2017 02:32 AM

KCR condoles the death of former minister Kommu Papaiah Yadav

kommu-papaiah
సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
మోత్కూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొమ్ము పాపయ్య యాదవ్(75) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నాగోల్‌లోగల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. యాదవ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారు.

ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెంలోని పాపయ్య వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అప్పటి రామన్నపేట నియోజకవర్గం నుంచి పాపయ్య యాదవ్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య క్యాబినెట్‌లో కొంతకాలం పాటు విద్యుత్ శాఖ సహాయమంత్రిగా పని చేశారు.

1925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS