అన్ని రంగాల్లో మనమే నంబర్‌వన్


Mon,July 16, 2018 04:09 AM

Kavitha launches free midday meals for library visitors in Nizamabad

-రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ స్థాయిలో
-ప్రభుత్వం నడిపే అవకాశం రావొచ్చు: ఎంపీ కవిత
-బోధన్‌లో టీఆర్‌ఎస్ బూత్ కమిటీల సమావేశం
నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: అన్ని రంగాల్లో మన రాష్ట్రం ముందున్నదని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో సబ్బండవర్ణాలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ ఫలాలు యావత్ భారతదేశమంతటా అందాలని ఆశిస్తున్నామన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో టీఆర్‌ఎస్ పట్టణ, మండల బూత్ కమిటీ సభ్యుల సమావేశం ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఉన్నంత ప్రజాదరణ మరెవరికీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లకుపైగా గెలుస్తుందని, అది సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనంగా నిలువనున్నదన్నారు. టీఆర్‌ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గులాబీ పార్టీ సృష్టించబోయే అద్భుతాల్లో నిజామాబాద్ జిల్లా ముందుంటుందని, ఎంపీ కవిత ఆధ్వర్యంలో జరిగి తీరుతుందన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ నాలుగేండ్లలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ముందుకు దూసుకెళ్లిందన్నారు. ఏడ్చేది మాత్రం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని.. వాళ్ల ఏడుపునకు తగ్గట్టుగా మరో 14 ఏండ్లు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండదని ఆయన స్పష్టం చేశారు.

దేశస్థాయిలో మంచి అవకాశం రావచ్చు: ఎంపీ కవిత

దేశ స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపే అవకాశం మనకు రావచ్చని, ఇది టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరికీ గర్వకారణం అవుతుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ ప్రజల అభివృద్ధి, సంక్షే మం కోసం పాటుపడుతూనే, కార్యకర్తల వెన్నంటే ఉంటారని తెలిపారు. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తే అది పార్టీకి లభించిన గౌరవం. మీ నడవడిక పార్టీపై ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత జీవితం, ప్రజాజీవితాన్ని ప్రజలు గమనిస్తున్నారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే పని చేయొద్దు అని పార్టీ శ్రేణులకు ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పైస్థాయికి ఎదగాలని కోరుకోవడం సహజమని, అవకాశం, అదృష్టం రెండూ కలిసి రావాల్సి ఉంటుందన్న విషయాన్ని గమనించాలన్నారు.
Kavitha.jpg
ఈ విషయంలో తనను ఉదాహరణగా తీసుకోవాలన్నారు. కాస్త ముందూ వెనకా, అవకాశాలు అందరికీ వస్తాయని, వచ్చే అవకాశాలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉంటున్నారని ఎంపీ కవిత చెప్పారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఇంటి పార్టీగా ఆదరిస్తున్నారని.. అదే ఇతర పార్టీలను రాజకీయ పార్టీలుగా భావిస్తుండటం పార్టీ సభ్యులుగా మనందరికీ గర్వకారణమన్నారు. ఉద్యమంలో ముందున్న నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలోనూ దూసుకెళ్తున్నదన్నారు. బోధన్ పట్టణంలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.231కోట్లు ఖర్చు చేసిందని ఎంపీ కవిత తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే షకీల్, పార్టీ ఉమ్మడి జిల్లా ఇంచార్జి తుల ఉమ, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గడ్డం సుమనారెడ్డి, టీఎస్ రెడ్‌కో చైర్మన్ ఎస్‌ఏ అలీం, నాయకులు విఠల్‌రావు, విద్యాసాగర్, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

nzb.jpg

భోజన పథకం అద్భుతం ఎంపీ కవిత ప్రయత్నాన్ని అభినందించిన మంత్రి తుమ్మల

నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎంపీ కల్వకుంట్ల కవిత తన సొంత నిధులతో పాఠకుల సౌకర్యార్థం మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూరు ప్రభుత్వ దవాఖానాల్లో రోగుల సహాయకులకు కొద్ది నెలలుగా ఎంపీ కవిత సొంత డబ్బులతో మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారని, తాజాగా గ్రంథాలయంలోనూ అమలు చేయడం అభినందనీయమన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. పాఠకులే కాకుండా ఆ సమయానికి ఎవ్వరొచ్చినా భోజనం అందిస్తామన్నారు. గ్రంథాలయంలో అందించే భోజనం నాణ్యతతోపాటు ప్రతి రోజు మెనూను వాట్సాప్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

1229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS