వికారాబాద్ జిల్లాలో కర్ణుడి కోట!

Mon,November 11, 2019 02:17 AM

-తెలంగాణ చరిత్ర బృందం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కరన్‌కోట్ గ్రామంవద్ద కర్ణుడి పేరిట కోట ఉన్నదని తెలంగాణ చరిత్ర బృందం వెల్లడించింది. ఈ కోట వల్లనే ఆ గ్రామానికి కరన్‌కోట్ అనే పేరు వచ్చిందని పేర్కొన్నది. మహాభారతకాలంలోని కర్ణుడే ఈ కోటను కట్టించినట్లు స్థానికుల్లో ప్రచారంలో ఉన్న కథనమని చరిత్రకారుడు బీఏబీ గిరీశ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాతకాలం నాటి బురుజుల కలిగిన ఈ కోట చాలాభాగం కూలి పోయిందని, సింహద్వారం, రెండు బురుజులు ఇంకా ఉన్నాయన్నారు. దీని ప్రాంగణంలో 7 వీరగల్లులు, ఒక నాగ శిల్పం ఉన్నయని, వీరగల్లుల శిల్పాలు అక్కడ జరిగిన యుద్ధాన్ని స్మరించే సాక్ష్యాలని తెలిపారు.
KOTA2
ఈ వీరగల్లుల్లో రెండంతస్తులవి, మూడంతస్తులవి ఉన్నట్లు వెల్లడించారు. కోటలోపల వీరభద్రేశ్వరాలయం ఉందని, ముఖద్వారంపై కలశాలు, మధ్యలో నాగులకట్ట ఉన్నదని, దానిపై తలలేని వినాయక విగ్రహం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ఊర్లో చౌడమ్మగుడి ఉన్నదని చెప్పారు. కోట ముఖద్వారం ముందు ఆంజనేయ ఆలయం ఉన్నదని.. ఇక్కడ పూర్వం హనుమంతుడి శిల్పం ఎటువంటి ఆధారం లేకుండా గాల్లో తేలు తూ ఉండేదని, పాదాల కింద కాగితం పెట్టి ఇవతలకు తీసేవారమని స్థానికులు చెప్పినట్లు వెల్లడించారు.


ఆ ఖాళీ క్రమేణా పూడుకుపోయిందని తెలిపారు. కరన్‌కోట్ గ్రామం పూర్వం బౌద్ధం విలసిల్లిన ప్రాంతమనిపిస్తున్నద్నారు. చుట్టుపక్కల సంగం కలాస్ (సంగమం), శిరిగిరపేట్ (శ్రీగిరి, శ్రీ పర్వతం), కోటాస్పల్లి, మిట్ట బాస్పల్లి వంటి ఊరిపేర్లు ఇక్కడ బౌద్ధం వికసించిందనడానికి ఆనవాలని తెలిపారు. కరన్‌కోట్ ప్రాంతమంతా సున్నపురాయి దొరికే ప్రాంతంగా గిరీశ్ పేర్కొన్నారు.
KOTA1

187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles