కంటి వెలుగు జోరు


Tue,October 16, 2018 02:19 AM

kanti velugu Eye tests for 55 89 lakh people

-55.89 లక్షల మందికి పరీక్షలు
-3,148 గ్రామాలు, 220 వార్డుల్లో పరీక్షలు పూర్తి
-10,74,689 మందికి కండ్లద్దాల పంపిణీ
-ఊరూరా కొనసాగుతున్న వైద్యశిబిరాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ కంటివెలుగు వైద్యశిబిరాలు వాడవాడలా విజయవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామాలతోపాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని వివిధ వార్డుల్లో వైద్యశిబిరాలను నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం ప్రారంభించిన నాటినుంచి సోమవారం వరకు 38 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శిబిరాల్లో 55,89,633 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. మొత్తం 3,148 గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిల్లోని 220 వార్డుల్లో కంటి వైద్యశిబిరాల నిర్వహణ పూర్తయింది. ఇందులో 55,89,633 మందికి కంటి పరీక్షలు చేయ గా..10,74,689 మందికి రీడిం గ్ అద్దాలు అందజేశారు. కాగా, సోమవారం 1,13,168 మంది కి కంటిపరీక్షలు చేశారు. వీరిలో 14,521 మందికి కండ్లద్దాలను అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం 22,041మందికి కంటిపరీక్షలు నిర్వహించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపా రు. 4,370 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు.

kanti-velugu2

కండ్లు మస్కగా కనవడుతుండె

సాంచాలు నడుపుకుంట కుటుంబాన్ని పోషించుకు న్నా. బతుకమ్మ చీరల ఆర్డర్లతోటి సిరిసిల్లల మస్తు పని పెరిగింది. కానీ కండ్లు మబ్బు లు కనవడుట్ల సాంచాలు నడుపలేకపోయిన. కంటి వెలుగు శిబిరంల చూపెట్టుకున్నంక డాక్టర్లు అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు మంచిగ కనవడ్తున్నయ్. పోయి మల్ల సాంచాలు నడుపుకుంట.
- సబ్బని శ్రీనివాస్, గణేశ్‌నగర్, సిరిసిల్ల

kanti-velugu3

కేసీఆర్ పేదలకు దేవునవతారం

ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు దేవునవుతారం. అడుగకపోయినా పేదోళ్ల బాధలు గుర్తించి పథకాలు ప్రవేశపెట్టిం డ్రు. చాలా ఏండ్ల నుంచి కూలీ పనిచేసుకొని బతుకుతున్న మాకు ప్రభుత్వమే ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోవడం సంతోషదాయకం. ఎన్నో రోజులుగా కంటి పరీక్షలు చేయించుకోవాలనుకున్నప్పటికీ అవకాశం, పైసలు లేక చేయించుకోలేక పోయా. ఇప్పుడు ప్రభుత్వమే ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటుచేసి పరీక్షలు చేయడమేకాక ఉచితంగా అద్దాలు కూడా ఇచ్చింది.
- జూకంటి లక్ష్మి, పెద్దపల్లి
kanti-velugu4

945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS