కంటివెలుగు @ 76,24,280


Fri,November 9, 2018 01:58 AM

kanti velugu Completes medical camps in 4346 villages and 322 wards

-4346 గ్రామాలు, 322 వార్డుల్లో వైద్య శిబిరాలు పూర్తి
-1,14,282 మందికి కంటిపరీక్షలు
-11,302 మందికి కండ్లద్దాల పంపిణీ
-13,75,369 మందికి కండ్లద్దాలు పంపిణీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 76,24,280 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 13,75,369 మందికి కండ్లద్దాలు అందజేయగా మరో 11,32,340 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. శస్త్రచికిత్సలకు 5,73,411 మంది ని రిఫర్ చేశారు. 52 రోజుల్లో 4,346 గ్రామాలు.. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల పరిధిలోని 322 వార్డుల్లో శిబిరాల నిర్వహణ పూర్తయింది. కాగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1,14, 282 మందికి కండ్లపరీక్షలు నిర్వహించి 11,302 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20,588 మందికి పరీక్షలు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. వీరిలో 1584 మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా, 488మందిని శస్త్రచికిత్సలకు రిఫర్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3,69,889 మందికి కంటిపరీక్షలు చేయగా వీరిలో 63,617 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు. మరో 48,211 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించగా 24,412 మందిని శస్త్ర చికిత్సలకు రిఫర్‌చేశారు. గురువారంనాడు 8,889 మందికి పరీక్షలుచేసి 923 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,92,972 మంది పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 39,209 మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా శస్త్రచికిత్సలకు 14,991 మందిని రిఫర్‌చేశారు.

kanti-velugu-4

నా సమస్యకు పరిష్కారం దొరికింది

నేను కొన్నేండ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్నాను. కంటివెలుగు శిబిరంలో పరిష్కారం లభించింది. కేసీఆర్ సారుకు ధన్యవాదాలు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా శిబిరాలను ఏర్పాటుచేయడం వల్ల పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వైద్యం అందుతున్నది.
- గోనె మణి, బూడిదగడ్డ, కొత్తగూడెం
kanti-velugu-3

585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS