9,524 గ్రామాల్లో కంటిశిబిరాలు పూర్తి


Fri,February 22, 2019 02:13 AM

kanti velugu campaign completed in 9524 villages

1,52,74,440 మందికి పరీక్షలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంధత్వ రహిత తెలంగాణ సాధన దిశగా.. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ కంటివెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు మొత్తం 1,52,74,440 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 22,70,534 మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 17,92,169 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. శస్త్రచికిత్సలకు 9,23,618 మందిని రిఫర్‌చేశారు. కార్యక్రమం ప్రారంభమైననాటి నుంచి గురువారం వరకు 118 రోజుల్లో.. 9,524 గ్రామాలు, 842 మున్సిపల్ వార్డుల్లో కంటిపరీక్షల నిర్వహణ పూర్తయింది. కాగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 28,953 మందికి కంటిపరీక్షలు నిర్వహించి.. 1,764 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు. మరో 1,642 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 9,87,390 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,16,719 మందికి కండ్లద్దాలు అందజేశారు.

kantivelugu2
మరో 77,240 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. శస్త్రచికిత్సలకు 47,290 మందిని రిఫర్‌చేశారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3,15,815 మందికి కంటిపరీక్షలను నిర్వహించి.. 37,895 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు. శస్త్రచికిత్సల కోసం 17,810 మందిని రిఫర్‌చేశారు. జిల్లాలో మొత్తం 214 గ్రామాలకుగాను 209 గ్రామాల్లో కంటిపరీక్షలు పూర్తయ్యాయి. వనపర్తి జిల్లాలో ఐదు గ్రామాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3,48,592 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 60,107 మందికి కండ్లద్దాలు పంపిణీచేశారు. శస్త్రచికిత్సలకు 15,718 మందిని రిఫర్‌చేశారు.

kantivelugu4

మంచిగ కనిపిస్తున్నయ్

నాకు కొన్నిరోజుల నుంచి కండ్లు మసకగా కనిపిస్తున్నయ్. మనుషులను గుర్తుపట్టుడు, పేపర్ చదువుడు కష్టంగుండేది. కంటివెలుగులో కండ్లద్దాలు ఇచ్చారు. ఇప్పుడు కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్.
-లక్కం రాజయ్య, రైతు బొంకూర్, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా
kantivelugu3

279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles