ఊరికి ప్రేమతో..


Wed,September 11, 2019 03:11 AM

kancharla-krishna-reddy-give-one-crore-fund-government-programmme

-స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలిస్తున్న దాతలు
-ఉరుమడ్ల గ్రామానికి రూ.కోటి ఇచ్చిన కంచర్ల కృష్ణారెడ్డి
-గుత్తా జితేందర్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్ చెరో రూ.5 లక్షలు
-మేళ్లచెర్వుకు మైహోం సిమెంట్స్ నాలుగు ఎకరాల భూమి

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గ్రామాల అభివృద్ధికోసం విరాళాలు అం దించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముం దుకొస్తున్నారు. దాతల నుంచి నిధులు సేకరించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చొరువ తీసుకుంటున్నారు. మంగళవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి సమక్షంలో నల్లగొండ జిల్లా చిట్యా ల మండలం ఉరుమడ్ల గ్రామాభివృద్ధికి టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఇదేగ్రామానికి చెందిన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోదరుడు జితేందర్‌రెడ్డి రూ.5 లక్షలు, స్థానికుడైన మల్లేశ్‌గౌడ్ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు.

మేళ్లచెర్వు అభివృద్ధికి రూ.కోటి విరాళం

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్ర అభివృద్ధికి దాతలు సుమారు రూ. కోటి విరాళం ప్రకటించారు. మైహోం సిమెంట్స్ ఇండస్ట్రీస్ వారు గ్రామశివారులో డంపింగ్ యార్డు నిర్మాణానికి సు మారు నాలుగు ఎకరాలు ఇచ్చేందుకు సం సిద్ధత వ్యక్తం చేశారు. గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణానికి గ్రామానికి చెందిన కంటి వైద్యుడు డాక్టర్ జనార్దన్‌రెడ్డి రూ.10 లక్షలు, రైతు శాగంరెడ్డి భద్రారెడ్డి రూ.5 లక్షలు, అర్చకులు వెంకటేశ్వరశర్మ, రాధాకృష్ణమూర్తి రూ.50 వేల చొప్పున విరాళం ప్రకటించారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో విరాళం ఇచ్చిన దాతలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి శాలువలతో సత్కరించారు.

20 గుంటల భూమి విరాళం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి అభివృద్ధికి టీఆర్‌ఎస్ నేత రామగౌని అశోక్‌గౌడ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 15 గుంటలభూమి, రూ.50వేల నగదు అందజేశారు. అదేగ్రామానికి చెందిన కాంతారావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 5 గుంటల భూమిని ఇచ్చారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన గ్రామ కోఆప్షన్ సభ్యుడు మల్లేశ్ రూ.51వేలు, ముత్యంపేటకు చెందిన రాజయ్య రూ.80 వేలు అందించారు.

814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles