కాళేశ్వరం ప్రపంచంలోనే అత్యున్నత ప్రాజెక్టు

Sun,October 13, 2019 01:40 AM

-ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు
-నిట్‌లో పూర్వ విద్యార్థులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

నిట్‌క్యాంపస్(వరంగల్): కాళేశ్వరం ప్రపంచంలోనే అనేక ప్రత్యేకతలున్న అత్యున్నత ప్రాజెక్టు అని కాళేశ్వరం ఇంజినీరింగ్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(నిట్)లో జరుగుతున్న 60 ఏండ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా శనివారం అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. లింక్-1లో భాగంగా గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ చేయడం ప్రపంచంలో మొదటి ప్రక్రియ అని ఈఎన్సీ వివరించారు. లింక్-2 ద్వారా లిఫ్టింగ్ పద్ధతిలో నీటిని పంపింగ్ చేయడం అత్యంత సాహసోపేతమైన, అద్భుతమైన ప్రక్రియగా పేర్కొన్నారు. గొప్ప విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను ఆచరణలో పెట్టడం ద్వారా కాళేశ్వరం గురించి ప్రపంచం ఆసక్తిగా చూసిందన్నారు. తెలంగాణకు 45 లక్షల ఎకరాలకు నీరందించే లైఫ్‌లైన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని తెలిపారు.

145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles