అంతర్జాతీయస్థాయిలో కాళేశ్వరం కీర్తిపతాక


Mon,August 19, 2019 02:17 AM

Kaleshwaram irrigation project Gayatri Pump House glittering on TimesCare screen in New York

-న్యూయార్క్‌లోని టైమ్స్‌స్కేర్ స్క్రీన్‌పై మెరిసిన గాయత్రి పంప్‌హౌస్
-రోజుకు ఐదుసార్లు వీడియో ప్రసారం
-ప్రపంచవ్యాప్తమవుతున్న తెలంగాణ అద్భుతం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా జగద్విఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు.. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్‌స్కేర్‌లోని భారీ తెరపై కాంతులీనింది. తెలంగాణ ఇంజినీరింగ్ ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించిన గాయత్రి పంప్‌హౌస్ విజువల్స్‌ను టైమ్స్‌స్కేర్ కూడలిలోని తెరపై మూడురోజులపాటు రోజుకు ఐదుసార్లు చొప్పున ప్రదర్శిస్తున్నారు. బాహుబలి మోటర్లుగా పిలుస్తున్న 139 మెగావాట్ల భారీ మోటర్లు ఎత్తిపోసిన నీళ్లు డెలివరీ సిస్టర్న్‌నుంచి కిందికి దుంకుతున్న దృశ్యాలతోపాటు.. గ్రావిటీ కెనాల్‌ద్వారా నీరు పారుతుండటాన్ని ఆ వీడియోలో చూపారు. లక్ష్మీపూర్ సర్జ్‌పూల్, భూగర్భంలోని భారీ మోటర్లు, పంప్‌హౌస్ దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.

అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌గా గాయత్రి

గోదావరిలో గరిష్ఠ నీటిలభ్యత, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-8లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌గా గాయత్రి పంప్‌హౌస్‌ను నిర్మించారు. ఈ పంప్‌హౌస్‌లో 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు మోటర్లు ఉన్నాయి. ఇంత భారీ మోటర్లను ప్రపంచంలో ఏ ఎత్తిపోతల పథకంలోనూ ఇంతవరకు ఉపయోగించపోవడం విశేషం. భూగర్భంలో దాదాపు 140 మీటర్ల లోతుల్లో ఉన్న పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటర్లు నీటిని 117 మీటర్ల ఎత్తుకు పంప్‌చేస్తాయి. ప్రస్తుతం ఈ మోటర్ల వెట్‌ట్రయల్ రన్ దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మోటర్లతో రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చు.

769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles