కాళేశ్వరం ఎత్తిపోతల పరీక్ష సక్సెస్


Thu,April 18, 2019 01:57 AM

Kaleshwaram heavy motor vetes within a week

-వేంనూర్ పంప్‌హౌస్ నుంచి నీటి విడుదల విజయవంతం
-పూజలు నిర్వహించి షట్టర్లు లేపిన అధికారులు
-వారం రోజుల్లో కాళేశ్వరం భారీ మోటరు వెట్న్
-ఈ నెల 23 లేదా 24న చేపట్టేందుకు అధికారుల నిర్ణయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/రామగుండం రూరల్/ ధర్మారం: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో బుధవారం మరో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం జలాలను ఈ వానకాలంలోనే చెరువులకు మళ్లించాలన్న సంకల్పంతో ఉన్న అధికారులు ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటుచేసిన భారీ మోటర్లను వెట్న్ ద్వారా పరీక్షించేందుకు సన్నద్ధమయ్యా రు. వారంరోజుల్లో భారీమోటరు వెట్న్ చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం పాలకుర్తి మండలం వేంనూర్ గ్రామం వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ను వేంనూర్‌లోని పంప్‌హౌస్ నుంచి కాళేశ్వరం 6వ ప్యాకేజీ అండర్‌టన్నెళ్లలోకి తరలించే ప్రక్రియ విజయవంతమైంది.

బుధవారం వేంనూర్ పంప్‌హస్ వద్ద సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం టెక్నికల్ అడ్వయిజర్ పెంటారెడ్డి, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్, ఏఈ ఉపేందర్, నవయుగ నిర్మాణ సంస్థ డైరెక్టర్ వెంకటరామారావు, జీఎం శ్రీనివాస్‌రావు.. గోదావరితల్లికి హారతిచ్చి, ప్రత్యేకపూజలు చేసి, పంప్‌హౌస్ ఐదు షట్టర్లలో ఒక షట్టర్‌ను పైకెత్తి 3,200 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కెనాల్‌లోకి విడుదల చేశారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 8.6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వెట్న్ కోసం దాదాపు 0.2 టీఎంసీలు వదలనున్నారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి వదిలిన గోదావరిజలాలు 1.1 కిలోమీటర్ల పొడవు ఉన్న గ్రావి టీ కాల్వ ద్వారా జంట సొరంగాల్లోకి ప్రవేశించాయి. సుమారు 9.34 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ జంట సొరంగాల ద్వారా జలాలు నందిమేడారం పంపుహౌజ్‌లోని సర్జ్‌పూల్‌కు చేరుకోనున్నాయి.
Kaleshwaram1
అయితే సర్జ్‌పూల్‌ను ఒక్కసారిగా కాకుండా అంచెలంచెలుగా నింపనున్నారు. తొలుత పదిశాతం మేర నింపి లీకేజీలను పరిశీలించనున్నారు. అలా క్రమంగా పరిశీలిస్తూ వందశాతం నింపుతారు. బుధవారం సొరంగాల్లోకి ప్రవేశించిన జలాలు.. సర్జ్‌పూల్ వరకు వెళ్లడం, సర్జ్‌పూల్‌ను అంచెలంచెలుగా నింపడానికి 3 నుంచి 4 రోజుల సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో వెట్న్ నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించా రు. నందిమేడారం పంపుహౌజ్‌లో 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు మోటర్లు ఇప్పటికే డ్రైరన్ పూర్తి చేసుకొని వెట్న్‌క్రు సిద్ధంగా ఉన్నాయి. వేంనూర్ పంప్‌హౌజ్ నుంచి నీటి విడుదల ట్రయల్న్ విజయవంతం కావడంతో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ నవయుగ, ఇంజినీరింగ్ అధికారులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
Kaleshwaram2

2163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles