నమస్తే కార్టూనిస్టుకు కళారత్న పురస్కారం


Thu,September 12, 2019 02:56 AM

Kala Ratna Award for Namaste Cartoonist

- 14న రవీంద్రభారతిలో ప్రదానం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వంశీ ఆర్ట్ థియేటర్స్ 47వ వార్షికోత్సవంలో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులకు ఈ నెల 14న రవీంద్రభారతిలో కళారత్న పురస్కారాలను ప్రదానం చేయనున్నా రు. నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ చిలువేరును వంశీ- కళారత్న పురస్కారంతో సత్కరించనున్నారు. సినీనటి, బీజేపీ నాయకురాలు కవితకు జీవితసాఫల్య పురస్కారంతోపాటు స్వర్ణకంకణం ప్రదానం చేయనున్నారు. ఇతర రంగాల నుంచి ఉత్తేజ్ (సినిమా), సాక్షి ఎడిటర్ వీ మురళి (పత్రిక), కాలువ మల్లయ్య (సాహిత్యం), జీ సత్యనారాయణ (రంగస్థలం), రత్నశ్రీ (నాట్యకళ), నిహాల్ (సంగీతం), శ్రీవారి చంద్రశేఖర్ (పరిశోధన), బీ రామకృష ్ణ(టీవీ), రాజేశ్ అగర్వాల్ (సేవా), ఆర్ అశ్విని (క్రీడా), మంగా శ్రీనివాస్‌గౌడ్ (జానపద), డాక్టర్ ఈ భవానీ (సాంస్కృతిక), సిరిసిల్ల రాజేశ్వరి (దివ్యాంగ కవయిత్రి) ఉన్నారు.

75
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles