అదనపు జడ్జిగా జస్టిస్ శ్రీదేవి ప్రమాణ స్వీకారం


Thu,May 16, 2019 02:14 AM

Justice Sri Devi becomes Telangana High Court first woman judge

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జస్టిస్ గండికోట శ్రీదేవి బుధవారం తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ఉదయం 10 గంటలకు కోర్టుహాలు-1లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. తెలుగువారైన జస్టి స్ శ్రీదేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా. ఉత్తరప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్ష రాసిన ఆమె అఖిల భారత కోటాలో జడ్జి పోస్టుకు ఎంపికయ్యారు. అక్క డే వివిధ హోదాల్లో పనిచేసి అలహాబాద్ హైకోర్టులో అదనపు జడ్జి స్థాయికి ఎదిగారు. జస్టిస్ శ్రీదేవి విజ్ఞప్తి మేరకు ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. బుధవారం ప్రమాణం చేసిన ఆమె తెలంగాణ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు.

79
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles