నిరంతర శ్రమతో ఉన్నతస్థాయి


Sat,September 14, 2019 02:02 AM

Justice Lakshman at the Social Justice Lawyers Forum

- సోషల్ జస్టిస్ లాయర్స్ ఫోరం సన్మానంలో జస్టిస్ లక్ష్మణ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ బషీర్‌బాగ్: న్యాయవాదులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతో పనిచేస్తే ఉన్నతస్థానాలకు ఎదుగవచ్చని తెలిపారు. శుక్రవారం సాయంత్రం సోషల్ జస్టిస్ లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్ లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. పదిమందికి సేవచేసే అవకాశం న్యాయవృత్తిలోనే లభిస్తుందన్నారు. గతంతో పోలిస్తే ఎన్నో అవకాశాలు సాంకేతికంగా అందుబాటులోకి వచ్చాయని, జడ్జిమెంట్లు, కేస్ స్టడీస్ అన్ని లభిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రయ్య, అడ్వకేట్ జనరల్ బండా శివానందప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్‌చైర్మన్ కే సునీల్‌గౌడ్, సభ్యులు ముఖీద్, చలసాని వెంకట్‌యాదవ్, భార్గవ్, హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మలుగారి సుదర్శన్, సోషల్ జస్టిస్ లాయర్స్ ఫోరం నాయకులు రాపర్తి వెంకటేశ్‌గౌడ్, జనార్దన్‌గౌడ్, రామారావు, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

59
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles