కోర్టులో లొంగిపోయిన జూనియర్ ఆర్టిస్ట్ కోటి


Wed,June 12, 2019 02:14 AM

Junior artist koti who surrendered in court

-లక్ష్మీపార్వతి, నటి పూనంకౌర్ కేసులలో నిందితుడు
-విచారణకు వస్తున్నానంటూ బుకాయించి కోర్టులో ప్రత్యక్షం

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వైఎస్సీర్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, నటి పూనంకౌర్‌పై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన జూనియర్ అర్టిస్ట్ కోటి అలియాస్ ఆనందపాల్ అనే వ్యక్తి.. నాటకీయ పరిణామాల మధ్య కోర్టు ఎదుట లొంగిపోయా డు. నాంపల్లి కోర్టులో దర్శనమివ్వడంతో పట్టుకొనేందుకు వచ్చిన హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు బురిడీ కొట్టి న్యాయమూర్తి ముం దుకు రావడంతో.. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనపై సోషల్‌మీడియాలో అసత్య, అసభ్యకరమైన ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీపార్వతి ఏప్రిల్‌లో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీ స్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదుచేశారు.

తనపై యూట్యూబ్‌లో అభ్యంతకర వీడియోలను అప్‌లోడ్‌చేసిన గుర్తుతెలియని వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని నటి పూనంకౌర్ ఏప్రిల్ లో సీసీఎస్ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. లక్ష్మీపార్వతి, పూనంకౌర్‌పై తప్పుడు పోస్టులు పెట్టింది కోటి అనే జూనియర్ ఆర్టిస్ట్ ఒక్కరే అని పోలీసులు తేల్చి ఆధారాలు సేకరించారు. తదుపరి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు పంపడంతో.. న్యాయవాదితో కలిసివస్తున్నట్టు పలుమార్లు బుకాయించాడు.

4066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles