టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం!


Thu,July 12, 2018 01:48 AM

Jogu Ramanna Fires On BJP President Laxman

-బీజేపీవి చౌకబారు ఆరోపణలు
-వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు
-బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖల మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సర్కార్‌పై లక్ష్మణ్ చేసిన ఆరోపణలను ఖండించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని హెచ్చరించారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.

847
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles