దళిత యువతకు సర్కార్ దన్ను


Tue,August 13, 2019 04:06 AM

Job creation with specialized training for dalits

-ప్రత్యేక శిక్షణతో ఉద్యోగావకాశాల కల్పన
-వృత్తివిద్య శిక్షణతో నైపుణ్యం మెరుగు
-ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫినిషింగ్ స్కూల్ తర్ఫీదు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని దళిత యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఎస్సీ యువత ఆర్థిక ప్రగతికి ఒకవైపు స్వయం ఉపాధి రుణాలు అందించడమే కాకుండా.. వృత్తివిద్య కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. మోటార్ డ్రైవింగ్, ఆటోమొబైల్, మొబైల్ మరమ్మతు, ఆటోమొబైల్ సర్వీసింగ్ సెంటర్, టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ టెక్నాలజీ, ప్లంబింగ్, కంప్యూటర్ శిక్షణ, ఎయిర్ హోస్టెస్, చెఫ్, పంచకర్మ ఆయుర్వేద వైద్యం, హెల్త్ కేర్ వంటి పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, ఆయా రంగాల్లో ఉండే ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకొని కొత్త అంశాల్లోనూ శిక్షణ అందించడంపై శ్రద్ధ తీసుకొంటున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత జులై చివరి నాటికి 3,915 మందికి ఉద్యోగ, ఉపాధి నైపుణ్య శిక్షణ అందించారు. ఇందుకు ప్రభుత్వం రూ.18.39 కోట్లు వెచ్చించింది.

వంద శాతం సబ్సిడీతో ఉచిత శిక్షణ

ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్న ఎస్సీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి.. తద్వారా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఇప్పించేందుకు కృషిచేస్తున్నారు. అలాగే స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నారు. దళిత యువకుల ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ.. వంద శాతం సబ్సిడీతో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఇంజినీరింగ్ చదివి ఉద్యోగాలు దొరుకనివారికి ఫినిషింగ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. సీఏపీ, సీఐపీఈటీ, డీబీటెక్, డాటాప్రో, ఎలక్ట్రానిక్ హౌస్‌వైరింగ్, జనరల్ వర్క్స్, సూపర్‌వైజర్, పీఎల్‌ఈ, ఎస్‌సీఏడీఏ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటితోపాటు జీడీఏ, నర్సింగ్, హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్, ల్యాండ్ సర్వే, టైలరింగ్, కంప్యూటర్, ఇండస్ట్రియల్ ఆటోమెషిన్ ట్రైనింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు.

దళితులకు దన్నుగా నిలుస్తున్నాం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దళితులకు దన్నుగా నిలిచేలా కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా చేస్తున్నాం. ఇంజినీరింగ్ పూర్తిచేసుకొని ఉద్యోగావకాశాలు దక్కని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఫినిషింగ్ స్కూల్ కార్యక్రమం ద్వారా నైపుణ్య శిక్షణ అం దించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. ఈ శిక్షణకు ఒక్కో విద్యార్థిపై రూ.57వేల నుంచి రూ.92వేల వరకు ఖర్చు చేస్తున్నాం. వృత్తి నైపుణ్య శిక్షణతో ఎస్సీ నిరుద్యోగులకు భరోసా కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నది.
skill2
- కొప్పుల ఈశ్వర్, సంక్షేమశాఖ మంత్రి

Dalit21

1119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles