సహజ కవి చందాల కేశవదాసు


Tue,June 21, 2016 02:07 AM

Jnanpith award winner C Narayana Reddy desire

-వచ్చే జయంతి నాటికి సమగ్ర సంపుటిగా ఆయన సాహిత్యం
-జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సినారె ఆకాంక్ష
-తెలంగాణ సారస్వత పరిషత్‌లో కేశవదాసు జయంతి

తెలుగు యూనివర్సిటీ: తెలంగాణ సాహిత్యయోధుడు చందాల కేశవదాసు సహజ కవి అని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ రచయితల వేది క ఆధ్వర్యంలో తొలి సినీ కవి, నాటక రచయిత, సాహితీవేత్త చందాల కేశవదాసు జయంతి సభ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరిగింది. ఈ సభలో ఘనంగా నివాళులర్పించిన సినారె మాట్లాడుతూ వచ్చే ఏడాది కేశవదాసు జయంతి నాటికి ఆయన సాహిత్యాన్ని సమగ్ర సంపుటిగా తీసుకురావాలని ఆకాంక్షించారు. కేశవదాసు సాహిత్యం లో పలు కోణాల్లో రచనలుచేశారని గుర్తుచేశారు. ఆయన రాసిన పలు పాటలను సినారె ఆలాపించి ప్రేక్షకులను అలరింపజేశారు. తెలంగాణ రచయితల వేదిక (తెరవే) అధ్యక్షుడు ఆచార్య జయధీర్‌తిరుమలరావు మాట్లాడుతూ కేశవదాసు జీవితం వైవిధ్యం గా, విలక్షణంగా సాగిందని వివరించారు. గురజాడ కన్యాశుల్కంకు ముందే వచ్చిన కేశవదాసు కనకధార గొప్ప సంస్కరణ సాహిత్యమైనా కొందరు దానిని వెలుగులోకి రానివ్వలేదన్నారు. ఆయన సంఘ సంస్కర్త అని అన్నారు. జాతీయోద్యమ సమయంలో ఆయన సాహిత్య సంపదను దగ్ధంచేశారని చెప్పారు. ప్రజల్లో నిలిచిపోయే గొప్ప సాహిత్యం అందించిన మహాకవి చందాల కేశవదాసు అని జయధీర్ అభివర్ణించారు. తెరవే మాజీ అధ్యక్షుడు జూలూ రు గౌరీశంకర్ మాట్లాడుతూ కేశవదాసు జీవితచరిత్ర, సాహిత్యం పరిశోధనలు జరపాలన్నారు. ఆ పరిశోధనలు పాఠ్యాంశాల్లో చేర్చి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త పురుషోత్తమాచార్య మాట్లాడుతూ నిరంతరం సమాజ హితం పాటుపడ్డ కేశవదాసు జయంతిని తెలంగాణ నాటక రంగ దినోత్సవంగా ప్రభుత్వాన్ని కోరారు. సాహితీవేత్త రమేశ్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం కేశవదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో లెనిన్‌శ్రీనివాస్ పాల్గొన్నారు.
cinare

1491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS