టీఎస్ రెడ్కో వీసీఎండీగా జానయ్య బాధ్యతలు


Tue,September 11, 2018 12:44 AM

Janasiah is responsible for TS Redco VCMD

-పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధుల అభినందనలు
హైదరాబాద్ నమస్తే తెలంగాణ: తెలంగాణ నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్‌రెడ్కో) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్ జానయ్య సోమవారం ఖైరతాబాద్‌లోని రెడ్కో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. టీఎస్ రెడ్కో చైర్మన్‌గా ఉన్న సుధాకర్‌రావును మాతృశాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశిస్తూ.. జానయ్యకు వీసీఎండీగా బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శివాజీ, ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ల సంఘం ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య, కంపెనీ ప్రెసిడెంట్ వీరాస్వామి, రవికుమార్‌శెట్టి, పరమేశ్, సురేందర్‌రెడ్డి జానయ్యకు అభినందనలు తెలిపారు.

122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles