జాగృతి సదస్సుకు దేశవిదేశీ ప్రతినిధులు


Sat,January 19, 2019 02:46 AM

Jagruthi youth convention to kick start on Saturday

-సదస్సు ఉద్దేశాలను వివరించిన ఎంపీ కవిత
-నేటి సెషన్‌లో ప్రసంగించనున్న అన్నాహజారే, అర్జున్ బహదూర్ థాపా
-శేఖర్‌గుప్తా చర్చలో పాల్గొననున్న ఎంపీలు కవిత, ఒవైసీ, గౌరవ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ వేదికగా తెలంగాణ జాగృతి సంస్థ గాంధేయమార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు కోసం శుక్రవారం విచ్చేసిన ప్రతినిధులకు జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సదస్సు ఉద్దేశాలను వివరించారు. గాంధీ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని, గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి సాధనతో పాటు నూతన ఆవిష్కరణల కోసం సదస్సులో యువ నాయకులు చర్చించాలని ఆమె కోరారు. 135 దేశాల నుంచి హాజరైన ప్రతినిధుల గౌరవార్థం నోవాటెల్ హోటల్‌లో ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సమావేశానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా హాజరయ్యారు. శనివారం సెషన్‌లో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే, సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ థాపా ప్రసంగిస్తారు.
Kavitha
ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షోపన్యాసం చేయనున్నారు. వాక్ ద టాక్ ఆన్ యూత్ డెవలప్‌మెంట్ అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో ప్యానెల్ డిస్కషన్ జరుగనున్నది. ఈ చర్చలో ఎంపీలు కవిత, అసదుద్దీన్ ఒవైసీ, గౌరవ్ గగోయ్ పాల్గొననున్నారు. గాంధీ, యూత్ అండ్ సస్టెయినబిలిటీ-పర్‌స్పెక్టివ్ ఫ్రం ద వరల్డ్ అంశంపై యూకే ఎంపీ సీమా మల్హోత్రా, న్యూజీలాండ్ ఎంపీ కన్వల్జిత్‌సింగ్ భక్షి, యునైటెడ్ నేషన్స్‌లో నేపాల్ శాశ్వత ప్రతినిధి మధురామన్‌ఆచార్య, ఆప్ఘనిస్తాన్, ఒకినావాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ వ్యవస్థాపకుడు జాన్‌డిక్సన్, శ్రీలంక పరిశ్రమలు, వాణిజ్యశాఖ ఉపమంత్రి బుదికా పథిరాణా, మాసిడోనియా రిపబ్లిక్ పెట్టుబడులశాఖ మాజీ మంత్రి గ్లిగర్ తస్కోవిచ్ ప్రసంగిస్తారు.
kavitha1
ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, 16 దేశాల నుంచి 70 మంది వక్తలు, 40 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతున్నారు. ఆదివారం సాయంత్రం జరుగనున్న సదస్సు ముగింపు సమావేశానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles