చకచకా మూసీ గేటు పనులు

Thu,October 10, 2019 03:04 AM

-డ్యాంవద్దకు చేరిన స్టాప్‌లాగ్ గేట్లు
-పర్యవేక్షిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
-నేడు గేటు బిగించే అవకాశం

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు రెగ్యులేటెడ్ గేటు మరమ్మతు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇటీవల నీటి ఒత్తిడితో పక్కకు జరిగిన గేటు స్థానంలో నూతన గేటును ఏర్పాటుచేసేందుకు అవసరమైన రెండు స్టాప్‌లాగ్ గేట్లను ఏపీలోని చిత్తూరు జిల్లా కళ్యాణి డ్యాం నుంచి అధికారులు తీసుకొచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికన గేటును ఏర్పాటు చేసేందుకు అవసరమైన భాగాలను యుద్ధప్రాతిపదికన తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఇక్కడి అధికారులను పురమాయించారు. గేటు ఏర్పాటుకు అవసరమైన మిగిలిన కొన్ని భాగాలు హైదరాబాద్ మియాపూర్ నుంచి తీసుకొస్తున్నారు. గురువారమే గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, మంగళవారం మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాజెక్టు వద్ద గేటును పరిశీలించారు. ఆయకట్టు రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రాజెక్టును నింపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.

410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles