ఉత్తమ్ వల్లే వెనుకబాటు

Sun,October 13, 2019 02:08 AM

- హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్
హుజూర్‌నగర్, నమస్తే తెలంగాణ/హుజూర్‌నగర్ రూరల్/నేరేడుచర్ల: హుజూర్‌నగర్ వెనుకబాటుకు పదేండ్లు ప్రజాప్రతినిధిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కారణమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇక్కడి ప్రజలు ఉత్తమ్ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని చెప్పారు. శనివారం హుజూర్‌నగర్ మండలంలోని వేపలసింగారంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ వెనుకబడ్డది అనే హక్కు ఉత్తమ్‌కు లేదన్నారు. 2014కు ముం దు, తర్వాత రాష్ట్రంలో ఏమి జరిగిందనేది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. హుజూర్‌నగర్ వెనుకబడలేదని, మనమే వెనుకబడేసుకున్నామన్నారు. రాష్ట్రమంతా ఒకవైపు వెళ్తుంటే హుజూర్‌నగర్ మరో దారిలో నడుస్తున్నదని చెప్పారు.
Jagadishreddy1
ఎన్నో ఏండ్లుగా ఇక్క డ ప్రజాప్రతినిధిగా ఉన్న ఉత్తమ్ మాటలు చూస్తుంటే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కాకుండానే సైదిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.కోట్లు తెచ్చారని చెప్పారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే సాధ్యం కాదని, అందుకే నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి సైదిరెడ్డిని అసెంబ్లీకి పంపించాలని కోరారు. రోడ్‌షోలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, అభ్యర్థి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంతోపాటు అడుగకముందే వరాలిచ్చే దేవుడని స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల, బూర్గులతండాలో, మఠంపల్లి మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి ప్రచారం నిర్వహించారు.

217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles