శాఖల విలీనానికి ఓకే


Sun,June 16, 2019 03:20 AM

JAC of Telangana government employees seek 43 per cent interim relief

-ఎక్కడ పనిచేయడానికైనా ఉద్యోగులు సిద్ధమే
-ప్రతి శాఖలో హెచ్‌వోడీ ఉండేలా చూడాలి
-ముందే ఉద్యోగ సంఘాలతో చర్చించాలి
-సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి
-ప్రభుత్వంతో స్నేహపూర్వక బంధం: ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పరిపాలనా సౌలభ్యం కోసం శాఖల విలీనం చేయాలనే నిర్ణయం తీసుకొంటే తమకేమీ అభ్యంతరంలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తేల్చిచెప్పారు. ప్రభు త్వ ఉద్యోగులు ఏ శాఖలోనైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఒకే శాఖలో పనిచేస్తామనే ఆలోచన తమకు లేదని స్పష్టంచేశారు. శనివారం టీఎన్జీవో భవన్‌లో జరిగిన ఉద్యోగ సం ఘాల జేఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. శాఖల విలీనంపై వస్తున్న అంశాలను సమర్థిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు సర్వీ సు విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రతి శాఖకు హెచ్‌వోడీలను కొనసాగించాలని, ముందే ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వల్ల కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని నెలాఖరులోగా తీరుస్తారనే నమ్మకం ఉన్నదన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతని రవీందర్‌రెడ్డి చెప్పారు. ఇటీవలే డీఏ ప్రకటించిన సీఎం కేసీఆర్.. పీఆర్సీ, ఐఆర్ కూడా ఇస్తారనే నమ్మకం తమకు ఉన్నదని ఆశాభా వం వ్యక్తంచేశారు. ఐఆర్‌ను 43 శాతం మంజూరుచేయాలని ఆయన కోరారు.

సమస్యలు తీరుతాయని విశ్వాసం

తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌కు, ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అహర్నిశలు కృషిచేసిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, ఉద్యోగవర్గాలందరికీ కారం రవీందర్‌రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విభజన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచకుండా ఉన్నాయని, ప్రస్తుతం ఏపీలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండటంతో సమస్యలన్నీ తీరుతాయనే నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్లిన ఉద్యోగులను స్థానికత ఆధారంగా తెలంగాణకు తీసుకురావాలని, దాదాపు 800 మంది ఇంకా ఏపీలో పనిచేస్తున్నారని చెప్పారు. సీపీఎస్ విధానం రద్దుకు తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

హామీల అమలుపై తీర్మానం

ఎన్నికల హామీ మేరకు పదవీ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ అందించాలని, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేయాలని రవీందర్‌రెడ్డి కోరారు. టీచర్ల పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు అమలుచేయాలని జేఏసీ సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు. విద్యావిధానంలో హేతుబద్ధీకరణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం బడిబాట ముగిశాక విద్యార్థులు లేని ప్రాంతాల్లో రేషనలైజేషన్ చేయాలని అ న్నారు.

ఉద్యోగుల హెల్త్ స్కీంలో కార్పొరేట్ దవాఖానలు వైద్యం చేయడంలేదని చెప్పారు. ఈహెచ్‌ఎస్‌లో ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీశాఖల ప్రక్షాళనను సమర్థిస్తున్నామని ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వీ మమత చెప్పారు. ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు మామిళ్ల రాజేందర్, ఏ సత్యనారాయణ, బీ రేచల్, గ్రూప్-1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంత్‌నాయక్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, కార్యదర్శి పవన్‌కుమా ర్, టీసీ టీజీవో అధ్యక్షుడు బీ వెంకటయ్య, రామినేని శ్రీనివాస్, ఎస్‌ఎం ముజీబ్, గండూరి వెంకటేశ్వర్లు, బీటీఎన్జీవో అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, బల రాం, ఆర్ ప్రతాప్, కొండల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, లక్ష్మణ్, బలరాం, రాజమౌళి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

టీజీవో నేతలకు సన్మానం

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలిగా వీ మమత, ప్రధాన కార్యదర్శిగా ఏ సత్యనారాయణ మూడోసారి ఎన్నికయ్యారు. టీజీవో హైదరాబాద్‌శాఖ అధ్యక్షుడు డాక్టర్ గండూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని టీజీవో భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డితోపాటు మమత, సత్యనారాయణను సన్మానించారు.

3416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles