ఇరిసెట్‌ 62వ వార్షికోత్సవం రేపు

Sat,November 23, 2019 02:25 AM

- హాజరుకానున్న రైల్వేబోర్డు చైర్మన్‌, తెలంగాణ సీఎస్‌


హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇండియన్‌ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సిగ్నల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ (ఇరిసెట్‌) 62వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. 1957 నవంబర్‌ 24న సికింద్రాబాద్‌లో ఇరిసెట్‌ను నెలకొల్పారు. రైల్వేతోపాటు పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లోని సిబ్బందికి ఇరిసెట్‌ శిక్షణ ఇస్తున్నది. ఎన్టీపీసీ, డీఎఫ్‌సీసీఐఎల్‌, ఆర్‌ఐటీఈఎస్‌, ఆర్వీఎన్‌ఎల్‌, ఆర్సీఐఎల్‌ వంటి సంస్థల్లోని సిబ్బందికి ఇరిసెట్‌లో పలు అంశాలపై తర్ఫీదునిస్తారు. ఇక్కడ సిగ్నలింగ్‌, టెలికమ్యూనికేషన్‌కు చెందిన 124 రకాల కోర్సులు బోధిస్తారు. ఇప్పటివరకు సుమారు 3031 మందికి ఇరిసెట్‌ శిక్షణ అందించింది. బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, లాన్‌ టెన్నీస్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ వంటి క్రీడలకు ఇరిసెట్‌లో ప్రోత్సాహం అందిస్తున్నారు. ముగింపు వేడుకల్లో రైల్వేబోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కీలకోపన్యాసం చేయనున్నారు. రైల్వేబోర్డు చైర్మన్‌ ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ టెస్టింగ్‌ వ్యవస్థను, పవర్‌ సిస్టం ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు.

167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles