అనుచిత ప్రచారం హేయం

Thu,December 5, 2019 02:03 AM

- దేవాదాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, పురాతన శిల్ప సంపదలను మైమరిపించేలా, ఆగమ సంప్రదాయాలను పాటిస్తూ సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారని, ఇలాంటి సమయంలో అనుచిత ప్రచారం చేయడం హేయమైన చర్య అని తెలంగాణ దేవాదాయశాఖ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు బేతి రంగారెడ్డి అన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి సూచనలను, సలహాలను పాటిస్తూ దేవాలయ పనులు అద్భుతంగా సాగుతున్నాయని చెప్పారు. నిర్మాణాలపైనే కాకుండా ఏకంగా స్వామివారి మూలవిరాట్టుకే అపచారం జరిగిందంటూ ప్రచారం చేయడం దిగజారుడుతనానికి నిదర్శమన్నా రు. స్వామివారికి ఎన్నో ఏండ్లుగా సిందూ రాన్ని తొలిగించలేదని, ఇప్పుడు దాన్ని తొలిగించి, మూల విరాట్టును శుద్ధిచేసి తిరిగి సిందూరంతో అలంకరించడం ఆగమ శాస్ర్తానుసారమే జరిగిందని చెప్పారు. యాదాద్రి ఆలయ కీర్తిప్రతిష్ఠలను ప్రపంచవ్యాప్తంచేస్తున్న విషయాన్ని తట్టుకోలేక కొందరు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని, తప్పుడు సమాచారాన్ని నమ్మరాదని భక్తులను రంగారెడ్డి కోరారు.

330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles