యురేనియంపై సర్వే అధికారుల అడ్డగింత

Wed,September 11, 2019 02:16 AM

వరకొండ, నమస్తే తెలంగాణ: నల్లమల అడవు ల్లో యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేవరకొండలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జియాలాజికల్ సర్వే కోసం దేవరకొండలోని ఓ లాడ్జిలో బసచేసిన అధికారులను ఆందోళనకారులు ఘెరావ్ చేశారు. సర్వేకోసం గ్రామాల్లోకి వెళ్లకుండా విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. ఆందోళనకారులు వెనక్కితగ్గకపోవడంతో చేసేదేమిలేక సర్వే అధికారులు వెనుదిరిగారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 30మంది సోమవా రం రాత్రి దేవరకొండలోని ఓ లాడ్జిలో బసచేశారు. క్షేత్రస్థాయి పరిశోధనలకోసం వెళ్తున్న సమయంలో విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకున్నారు.

187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles