మార్చిలో ఇంటర్ పరీక్షలు!


Tue,September 11, 2018 01:11 AM

Inter exams in March! ????? ??????

-ఈ నెల 17 నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం
-ఫీజు షెడ్యూల్ జారీచేసిన ఇంటర్‌బోర్డు సెక్రటరీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు ప్రథమ, ద్వితీయసంవత్సరం చదువుతున్న రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షఫీజు తేదీలను ప్రకటిస్తూ ఇంటర్‌బోర్డు సెక్రటరీ ఏ అశోక్ సోమవారం షెడ్యూల్‌ను విడుదలచేశారు. ఈ నెల 17 నుంచి పరీక్షఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారభంకానున్నది. ఎటువంటి ఆలస్యరుసుం లేకుండా అక్టోబర్ 24 వరకు గడువు విధించారు. రూ.100 ఆలస్యరుసుంతో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.500 ఆలస్యరుసుంతో నవంబర్ 9 నుంచి 26 వరకు.. రూ. 1,000 ఆలస్యరుసుంతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 11 వరకు, రూ.2,000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 నుంచి జనవరి 2, 2019 వరకు, రూ.3,000 ఆలస్యరుసుంతో జనవరి 3 నుంచి 21 వరకు, రూ.5,000 రుసుంతో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ప్రైవేటుగా పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు.

2485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles