కులాంతర వివాహం.. రూ.1.50 లక్షల జరిమానా!


Sat,September 14, 2019 01:34 AM

Inter caste marriage is a fine of Rs 1 50 lakh

-ఆపై కులబహిష్కరణ.. సర్పంచ్ భర్త నిర్వాకం
-పోలీసులకు యువతి కుటుంబం ఫిర్యాదు
తరిగొప్పుల: ప్రేమించి, పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్న ఓ యువతి కుటుంబానికి స్థానిక సర్పంచ్ భర్త రూ. 1.50 లక్షలు జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా కుల బహిష్కరణ చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని బొంతగట్టునాగారంలో చోటుచేసుకున్నది. ఆయనిచ్చిన తీర్పు మేరకు ఆ కుటుంబం ఇప్పటికే రూ.లక్ష జరిమానా చెల్లించగా మిగిలిన రూ.50 వేల కోసం ఇబ్బందులకు గురిచేస్తుండటంతో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బీరయ్య, ఓజవ్వ దంపతుల కూతురు వసంత వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటకు చెందిన యువకుడిని ప్రేమించింది. ఇరువైపులా పెద్దలను ఒప్పించి గత జూన్ 21న వివాహం చేసుకున్నది. కులాంతర వివాహం చేసినందుకు రూ.లక్ష, పెండ్లికి కుల పెద్దలు హాజరైనందుకు మరో రూ.50 వేలు జరిమానా కట్టాలని సర్పంచ్ బాలమణి భర్త రాజయ్య యువతి కుటుంబాన్ని ఆదేశించాడు. బీరయ్య రెండు విడుతల్లో రూ.50 వేల చొప్పున రూ.లక్ష చెల్లించినప్పటికీ, మిగిలిన రూ.50 వేలు చెల్లించాలని వేధించి, కులం నుంచి వెలివేశారు. దీంతో బీరయ్య కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

1146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles